వెస్టిండీస్‌కు గుడ్ న్యూస్‌.. జ‌ట్టులోకి విధ్వంస‌క‌ర ఆట‌గాడు

Published on Sat, 06/22/2024 - 17:58

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో మిగిలిన మ్యాచ్‌ల‌కు వెస్టిండీస్ స్టార్ ఓపెన‌ర్ బ్రాండెన్ కింగ్ గాయం కార‌ణంగా దూర‌మైన సంగ‌తి తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరిగిన  సూప‌ర్‌-8 మ్యాచ్‌లో కింగ్‌కు ప‌క్క‌టెముకుల గాయ‌మైంది. అత‌డు పూర్తిగా కోలుకోవడానికి రెండు వారాల స‌మ‌యం ప‌డుతుందని విండీస్  వైద్య‌బృందం వెల్లడించింది.

ఈ క్ర‌మంలో అత‌డి స్ధానాన్ని విధ్వంస‌క‌ర ఆల్‌రౌండ‌ర్  కైల్ మేయర్స్‌తో విండీస్ క్రికెట్ బోర్డు భ‌ర్తీ  చేసింది. మైర్స్ భర్తీని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) టెక్నికల్ కమిటీ ఆమోదించింది. అతడు దక్షిణాఫ్రికాతో జరిగే తమ చివరి సూపర్‌-8 మ్యాచ్‌కు విండీస్ జట్టుతో చేరే అవకాశముంది. 

కాగా టీ20ల్లో మైర్స్‌కు అద్బుతమైన రికార్డు ఉంది. టీ20ల్లో మైర్స్ 727 పరుగులతో పాటు 34 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇక ఇంగ్లండ్‌తో జ‌రిగిన తొలి సూప‌ర్‌-8 మ్యాచ్‌లో ఓటమి పాలైన క‌రేబియ‌న్లు.. అమెరికాతో మ్యాచ్‌లో తిరిగి క‌మ్‌బ్యాక్ ఇచ్చారు.

యూఎస్‌పై 9 వికెట్ల తేడాతో విండీస్ ఘ‌న విజ‌యం సాధించింది. విండీస్ త‌మ ఆఖ‌రి సూప‌ర్‌-8 మ్యాచ్‌లో ఆదివారం(జూన్ 23) ద‌క్షిణాఫ్రికాతో త‌ల‌ప‌డ‌నుంది. సెమీస్‌కు అర్హ‌త సాధించాలంటే ఈ మ్యాచ్ విండీస్‌కు చాలా కీల‌కం.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)