అక్టోబర్‌ 6న భారత్, పాక్‌ పోరు

Published on Tue, 08/27/2024 - 05:00

దుబాయ్‌: బంగ్లాదేశ్‌ నుంచి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)కు తరలి వెళ్లిన మహిళల టి20 ప్రపంచకప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌కు సంబంధించి సవరించిన షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) సోమవారం విడుదల చేసింది. అక్టోబర్‌ 3 నుంచి 20 వరకు జరిగే ఈ టోర్నీని యూఏఈలోని రెండు వేదికల్లో (షార్జా, దుబాయ్‌) నిర్వహిస్తారు. 

రెండు మ్యాచ్‌లు ఉంటే... భారత కాలమానం ప్రకారం తొలి మ్యాచ్‌ మధ్యాహ్నం గం. 3:30 నుంచి... రెండో మ్యాచ్‌ రాత్రి గం. 7:30 నుంచి జరుగుతాయి. టాప్‌–10 దేశాలు పోటీపడుతున్న ఈ టోరీ్నలో మొత్తం 23 మ్యాచ్‌లున్నాయి. బంగ్లాదేశ్, స్కాట్లాండ్‌ జట్ల మధ్య మ్యాచ్‌తో టోర్నీ మొదలవుతుంది. భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్‌ 4న న్యూజిలాండ్‌తో... అక్టోబర్‌ 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడుతుంది. 

అనంతరం అక్టోబర్‌ 9న శ్రీలంకతో, అక్టోబర్‌ 13న ఆ్రస్టేలియాతో భారత్‌ ఆడుతుంది. భారత్‌ సెమీఫైనల్‌ చేరుకుంటే అక్టోబర్‌ 17న దుబాయ్‌లో జరిగే తొలి సెమీఫైనల్లో  ఆడుతుంది. అక్టోబర్‌ 20న దుబాయ్‌లో జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది. ఆ్రస్టేలియా డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. సెమీఫైనల్స్, ఫైనల్‌కు ‘రిజర్వ్‌ డే’ కేటాయించారు. మొత్తం 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్‌ ‘ఎ’లో భారత్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక... గ్రూప్‌ ‘బి’లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్‌ జట్లున్నాయి. సెపె్టంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 1 వరకు 10 ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు జరుగుతాయి.

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)