Breaking News

ఐసీసీ చారిత్రత్మక నిర్ణయం.. రూ.66 కోట్ల ప్రైజ్‌మనీ

Published on Tue, 09/17/2024 - 16:47

అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చారిత్ర‌త్మ‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇక‌పై ప్రపంచ కప్ టోర్నమెంట్లలో పురుషులతో సమానంగా మహిళలకు ప్రైజ్‌మనీని ఐసీసీ అంద‌జేయ‌నుంది.  వచ్చే నెల యూఏఈ వేదికగా జరిగే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2024తో ఈ నిర్ణయాన్ని ఐసీసీ అమలు చేయనుంది. 

దీంతో టోర్నమెంట్ మొత్తం ప్రైజ్‌మనీ 7.958 మిలియన్ డాలర్లకు ( భార‌త క‌రెన్సీలో రూ.66 కోట్లు). గ‌త టోర్నీల‌తో పోలిస్తే ఇది  225 శాతం అధికం కావ‌డం విశేషం. వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌గా నిలిచిన జట్టు రూ.19 కోట్ల ప్రైజ్‌మనీ ల‌భించ‌నుంది. అదేవిధంగా రన్నరప్‌గా నిలిచిన జట్టు రూ.9 కోట్ల నగదు బ‌హుమ‌తి ద‌క్కించుకోనుంది.

"ఐసీసీ టోర్నీల్లో పురుషుల‌తో పాటు మ‌హిళ‌ల‌కు స‌మాన ప్రైజ్ మ‌నీ ఇవ్వ‌నున్నాం.  మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2024లో ఈ చారిత్రత్మ‌క నిర్ణ‌యాన్ని అమ‌లు చేయ‌నున్నాం. క్రీడా చరిత్ర‌లో ఇదొక మైలు రాయిగా నిలిచిపోతుంది. ఈ ఏడాది జూలైలో జ‌రిగిన ఐసీసీ వార్షిక స‌మావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాము. 

క్రీడల్లో లింగ వివక్ష లేకుండా చేసేందుకు మ‌రో అడుగు ముందుకు వేశాము. సమాన ప్రైజ్‌మనీ అందిస్తున్న క్రీడగా క్రికెట్ నిలిచింద‌ని" ఐసీసీ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. కాగా మహిళల టీ20 ప్రపంచ కప్‌ అక్టోబరు 3 నుంచి 20 వరకు యూఏఈ వేదికగా జరగనుంది.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

కృష్ణాష్టమి సెలబ్రేషన్.. కిరణ్ అబ్బవరం కొడుకు ఇలా (ఫొటోలు

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)