Breaking News

అండర్‌ 19 వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ విడుదల

Published on Mon, 12/11/2023 - 19:15

సౌతాఫ్రికా వేదికగా వచ్చే ఏడాది జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరిగే అండర్‌ 19 క్రికెట్‌ వరల్డ్‌కప్‌ 2024 షెడ్యూల్‌ను ఐసీసీ ఇవాళ (డిసెంబర్‌ 11) విడుదల చేసింది. ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ జనవరి 20న తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. భ్లోంఫాంటీన్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో యంగ్‌ ఇండియా.. బంగ్లాదేశ్‌తో తలపడనుంది. 

అనంతరం భారత్‌.. జనవరి 25, 28 తేదీల్లో ఐర్లాండ్‌, యూఎస్‌ఏలతో తమ తొలి రౌండ్‌ మ్యాచ్‌లు ఆడనుంది. జనవరి 19న జరిగే టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఐర్లాండ్‌, యూఎస్‌ఏ జట్లు తలపడనున్నాయి.

16 జట్లు నాలుగు గ్రూపులుగా విభజించడిన ఈ టోర్నీలో మొత్తం 41 మ్యాచ్‌లు జరుగనున్నాయి. గ్రూప్‌-ఏలో భారత్‌, బంగ్లాదేశ్‌, ఐర్లాండ్‌, యూఎస్‌ఏ జట్లు ఉండగా.. గ్రూప్‌-బిలో ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, స్కాట్లాండ్‌ జట్లు.. గ్రూప్‌-సిలో ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, నమీబియా జట్లు.. గ్రూప్‌-డిలో ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌, నేపాల్‌ జట్లు పోటీపడనున్నాయి. 

కాగా, తొలుత ఈ టోర్నీని శ్రీలంకలో నిర్వహించాలని ఐసీసీ భావించింది. అయితే ఆ దేశ క్రికెట్‌ బోర్డులో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఐసీసీ వేదికను దక్షిణాఫ్రికాకు మార్చింది. 


 

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)