ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌.. శ్రీలంక బ్యాటింగ్‌ కోచ్‌గా ఇంగ్లండ్‌ మాజీ ప్లేయర్‌

Published on Tue, 08/13/2024 - 17:34

ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం శ్రీలంక జట్టు ప్రత్యేకంగా బ్యాటింగ్‌ కోచ్‌ను నియమించుకుంది. ప్రత్యర్ధి జట్టుకు చెందిన మాజీ ఆటగాడిని శ్రీలంక జట్టు బ్యాటింగ్‌ కోచ్‌గా ఎంపిక చేసుకుంది. ఇంగ్లండ్‌ మాజీ బ్యాటర్‌ ఇయాన్‌ బెల్‌ లంకతో మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌కు శ్రీలంక బ్యాటింగ్‌ కోచ్‌గా వ్యవహరి​స్తాడు. ఈ విషయాన్ని లంక బోర్డు ఇవాళ (ఆగస్ట్‌ 13) ప్రకటించింది.

42 ఏళ్ల ఇయాన్‌ బెల్‌ 2004-15 మధ్యలో ఇంగ్లండ్‌ తరఫున 118 టెస్ట్‌లు, 161 వన్డేలు, 8 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో 22 సెంచరీలు, 46 హాఫ్‌ సెంచరీల సాయంతో 7727 పరుగులు.. వన్డేల్లో 4 సెంచరీలు, 35 హాఫ్‌ సెంచరీల సాయంతో 5416 పరుగులు.. టీ20ల్లో ఓ హాఫ్‌ సెంచరీ సాయంతో 188 పరుగులు చేశాడు.

బెల్‌ను బ్యాటింగ్‌ కోచ్‌గా నియమించుకోవడం​ వెనుక శ్రీలంక క్రికెట్‌ బోర్డుది పెద్ద వ్యూహరచనే ఉంది. బెల్‌కు ఇంగ్లండ్‌ జట్టుతో సుదీర్ఘ అనుబంధం ఉంది కాబటి, ఆ జట్టు లోటుపాట్లు తెలిసే అవకాశం ఉంది. అలాగే బ్యాటింగ్‌ కోచ్‌గా కూడా బెల్‌కు మంచి ట్రాక్‌ రికార్డే ఉంది. ఈ అంశాలన్నీ ఇంగ్లండ్‌ పర్యటనలో శ్రీలంకకు కలిసొచ్చే అవకాశం ఉంది.

ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ కోసం శ్రీలంక జట్టు..
ధనంజయ డిసిల్వ (కెప్టెన్‌), దిముత్‌ కరుణరత్నే, నిషన్‌ మధుష్క, పథుమ్‌ నిస్సంక, కుసాల్‌ మెండిస్‌ (వైస్‌ కెప్టెన్‌), ఏంజెలో మాథ్యూస్‌, దినేశ్‌ చండీమల్‌, కమిందు మెండిస్‌, సమరవిక్రమ, అశిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో, కసున్‌ రజిత, లహీరు కుమార, నిసాల తారక, ప్రభాత్‌ జయసూర్య, రమేశ్‌ మెండిస్‌, జెఫ్రీ వాండర్సే, మిలన్‌ రత్నాయకే

ఇంగ్లండ్‌ జట్టు..
హ్యారీ బ్రూక్‌, డేనియల్‌ లారెన్స్‌, బెన్‌ డకెట్‌, జో రూట్‌, బెన్‌ స్టోక్స్‌ (కెప్టెన్‌), క్రిస్‌ వోక్స్‌, జోర్డన్‌ కాక్స్‌, ఓలీ పోప్‌, జేమీ స్మిత్‌ (వికెట్‌కీపర్‌), గస్‌ అట్కిన్సన్‌, షోయబ్‌ బషీర్‌, మాథ్యూ పాట్స్‌, ఓలీ స్టోన్‌, మార్క్‌ వుడ్‌

షెడ్యూల్‌..
ఆగస్ట్‌ 21-25: తొలి టెస్ట్‌ (మాంచెస్టర్‌)
ఆగస్ట్‌ 29-సెప్టెంబర్‌: రెండో టెస్ట్‌ (లార్డ్స్‌)
సెప్టెంబర్‌ 6-10: మూడో టెస్ట్‌ (కెన్నింగ్‌స్టన్‌ ఓవల్‌)

 

 

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)