Breaking News

ట్రోఫీ ప్రదానోత్సవానికి ఆహ్వానించలేదు: గావస్కర్‌

Published on Mon, 01/06/2025 - 04:22

సిడ్నీ: ‘బోర్డర్‌–గావస్కర్‌’ సిరీస్‌ విజేతకు ట్రోఫీ అందజేసే సమయంలో తనను ఆహ్వానించకపోవడంపై  భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. 1996–97 నుంచి భారత్, ఆ్రస్టేలియా మధ్య ‘బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ’ నిర్వహిస్తుండగా... తాజాగా జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆ్రస్టేలియా జట్టు 3–1తో విజయం సాధించింది. 

ఆదివారం ఆఖరి టెస్టు ముగిసిన అనంతరం విజేతగా నిలిచిన ఆ్రస్టేలియా జట్టుకు ఆ్రస్టేలియా దిగ్గజం అలెన్‌ బోర్డర్‌ ట్రోఫీ బహుకరించాడు. దీనిపై గావస్కర్‌ స్పందిస్తూ... ‘ట్రోఫీ ఇచ్చే సమయంలో అక్కడ ఉండటాన్ని ఇష్టపడేవాడిని. భారత్, ఆస్ట్రేలియా మధ్య అదీ బోర్డర్‌–గావస్కర్‌ సిరీస్‌ కదా. ఆ సమయంలో నేను మైదానంలోనే ఉన్నా. మెరుగైన ప్రదర్శన చేయడం వల్లే ఆ్రస్టేలియా గెలిచింది. 

నా స్నేహితుడు బోర్డర్‌తో కలిసి ట్రోఫీ అందించి ఉంటే ఇంకా ఆనందించేవాడిని’ అని అన్నాడు. మరోవైపు క్రికెట్‌ ఆ్రస్టేలియా (సీఏ) స్పందన దీనికి భిన్నంగా ఉంది. సిరీస్‌లో ఆ్రస్టేలియా విజేతగా నిలిస్తే అలెన్‌ బోర్డర్‌... భారత్‌ గెలిస్తే సునీల్‌ గావస్కర్‌ ట్రోఫీ అందించాలని నిర్ణయించినట్లు సీఏ తెలిపింది. ఈ విషయాన్ని వారిదద్దరికీ గతంలోనే చెప్పినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.  
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)