Breaking News

అతడి బ్యాటింగ్‌ అద్భుతం.. మా ఓటమికి కారణాలు ఇవే.. మరో మూడేళ్లు..

Published on Sat, 05/03/2025 - 09:48

ఐపీఎల్‌లో గతేడాది రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) ఈసారి చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది. గుజరాత్‌ టైటాన్స్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో కమిన్స్‌ బృందం 38 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తద్వారా ఐపీఎల్‌-2025 (IPL 2025)లో రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌ అవకాశాలు దాదాపుగా ముగిసిపోయాయి.

ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ (Pat Cummins) ఓటమి అనంతరం తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ఇటు బౌలింగ్‌లో.. అటు బ్యాటింగ్‌లోనూ విఫలమయ్యామని పేర్కొన్నాడు. ఈ ఘోర ఓటమికి తానూ బాధ్యత వహిస్తున్నానని తెలిపాడు.

పవర్‌ ప్లేలో మేము విఫలం
‘‘పవర్‌ ప్లేలో మా ఇన్నింగ్స్‌ అంత గొప్పగా ఏమీ సాగలేదు. అందరిలాగే నేనూ ఈ పరాజయానికి బాధ్యుడిని. నాకు తెలిసి.. మేము 20-30 అదనపు పరుగులు సమర్పించుకున్నాం. అంతేకాదు.. రెండు- మూడు క్యాచ్‌లు మిస్‌ చేసుకున్నాం.

అక్కడ కూడా నా తప్పు ఉందనే చెప్పాలి. ఇక 200కు పైగా పరుగుల ఛేదన అంత కష్టమేమీ కాదు. కానీ ఈరోజు మేము అందులో సఫలం కాలేకపోయాం. ఆ జట్టులో క్లాస్‌ బ్యాటర్లు ఉన్నారు.

మా బౌలింగ్‌ అత్యంత చెత్తగా సాగింది
చెత్త బంతులు పడితే కచ్చితంగా బాదేస్తారు. ఈరోజు అదే జరిగింది. నిజంగా మా బౌలింగ్‌ అత్యంత చెత్తగా సాగింది. వికెట్‌ బాగున్నా మేము దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాం.

ఇక అభిషేక్‌ శర్మ ఈరోజు అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. నితీశ్‌ ఆఖర్లో పోరాడాడు. అయితే, అప్పటికే ఆలస్యమైపోయింది. పరిస్థితి మా చేయిదాటి పోయింది. వేలంలో మేము సరైన నిర్ణయాలే తీసుకున్నాం అనుకుంటున్నాం.

 మూడేళ్ల పాటు
ఈ కోర్‌ గ్రూప్‌ మూడేళ్ల పాటు కొనసాగుతుంది. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది’’ అని ప్యాట్‌ కమిన్స్‌ చెప్పుకొచ్చాడు. కాగా అహ్మదాబాద్‌లో టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ తొలుత బౌలింగ్‌ చేసింది.

ధారాళంగా పరుగులు సమర్పించుకుని
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్‌ సొంత మైదానంలో దుమ్మురేపింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఏకంగా 224 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో మహ్మద్‌ షమీ (3 ఓవర్లలో 48), హర్షల్‌ పటేల్‌ (3 ఓవర్లలో 41)ధారాళంగా పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయారు.

మిగతా వాళ్లలో జీషన్‌ అన్సారీ తన బౌలింగ్‌ కోటాలో 42 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీయగా.. జయదేవ్‌ ఉనాద్కట్‌ నాలుగు ఓవర్లలో 35 రన్స్‌ మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు కూల్చాడు. కెప్టెన్‌ కమిన్స్‌ నాలుగు ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ పడగొట్టాడు.

బ్యాటర్లు కూడా చెత్తగా ఆడి
బౌలర్ల సంగతి ఇలా ఉంటే... లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌ బ్యాటర్లు కూడా చెత్త ప్రదర్శన కనబరిచారు. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (41 బంతుల్లో 74) ఒక్కడే అర్ధ శతకంతో రాణించగా.. ట్రవిస్‌ హెడ్‌ (20), ఇషాన్‌ కిషన్‌ (13), హెన్రిచ్‌ క్లాసెన్‌ (23), అనికేత్‌ వర్మ (3) విఫలమయ్యారు. ఆఖర్లో నితీశ్‌ రెడ్డి 10 బంతుల్లో 21 పరుగులతో నాటౌట్‌గా నిలిచినా ఫలితం లేకపోయింది. 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 186 పరుగుల వద్ద నిలిచిపోయిన రైజర్స్‌.. 38 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

చదవండి: Shubman Gill: అంపైర్‌తో గొడవపడి.. అభిషేక్‌ను కాలితో తన్ని!    

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)