Breaking News

ఇదేమి నాకు కొత్త కాదు.. క్రికెట్‌ కూడా వదిలేయాలనుకున్నా: హర్షిత్‌ రాణా

Published on Sun, 01/18/2026 - 20:16

టీమిండియా యువ ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా తరుచూ సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొం‍టున్న సంగతి తెలిసిందే. హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ సపోర్ట్ వల్లే అతడికి మూడో ఫార్మాట్లలో ఆడే అవకాశం​ దక్కుతుందని చాలా మంది మాజీ క్రికెటర్లు సైతం విమర్శించారు. ఈ ఢిల్లీ ఆల్‌రౌండర్ టెస్టులకు దూరంగా ఉంటున్నప్పటికి.. భారత పరిమిత ఓవర్ల జట్టులో మాత్రం రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగుతున్నాడు.

హర్షిత్ టీ20ల్లో పెద్దగా రాణించికపోయినప్పటికి.. వన్డేల్లో మాత్రం అద్భుత ప్రదర్శన చేస్తూ విమర్శకుల నోళ్లు మూయిస్తున్నాడు. అయినప్పటికి ఏదో ఒక విధంగా అతడు ట్రోల్స్‌కు గురువుతున్నాడు. తాజాగా  ఓ ఇంటర్వ్యూలో హర్షిత్ రాణా తన కెరీర్‌ ప్రారంభంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నాడు.

"వైఫల్యాలను ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు నాకు బాగా తెలుసు. దాదాపు పదేళ్ల పాటు సెలక్షన్లలో నాకు నిరాశే ఎదురైంది. ఎన్నో ట్రయల్స్‌కు వెళ్లేవాడిని, కానీ ఫైనల్ లిస్ట్‌లో నా పేరు ఉండేది కాదు. ఇంటికి తిరిగి వచ్చి మా నాన్న ముందు ప్రతిరోజూ ఏడ్చేవాడిని. ఇప్పుడు ఏలాంటి వైఫల్యం ఎదురైనా దానిని తట్టుకోగలను. 

ఒకానొక దశలో క్రికెట్‌ను వదిలేయాలని అనుకున్నా. కానీ మా నాన్న ఇచ్చిన ప్రోత్సాహంతోనే మళ్లీ తిరిగి నిలబడ్డా" అని హర్షిత్ పేర్కొన్నాడు. కాగా  ప్రస్తుతం న్యూజిలాండ్‌తో  జరుగుతున్న సిరీస్‌లో కూడా హర్షిత్ మెరుగైన ప్రదర్శన చేశాడు. ఇప్పటి వరకు ఓవరాల్‌గా 13 వన్డేలు ఆడిన హర్షిత్ రాణా 23 వికెట్లు పడగొట్టాడు. టీ20 వరల్డ్‌కప్-2026 భారత జట్టులో కూడా రాణా సభ్యునిగా ఉన్నాడు.

Videos

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)