Breaking News

చాలా బాధ‌గా ఉంది.. అదే మా ఓట‌మికి కార‌ణం: వెస్టిండీస్ కెప్టెన్

Published on Mon, 06/24/2024 - 17:12

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో ఆతిథ్య వెస్టిండీస్ ప్ర‌యాణం ముగిసింది. సూప‌ర్‌-8లో భాగంగా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన విండీస్ సెమీస్ రేసు నుంచి నిష్క్ర‌మించింది. ఆఖ‌రి వ‌ర‌కు ఉత్కంఠ భ‌రితంగా సాగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో(డ‌క్ వర్త్ లూయిస్ ప‌ద్దతి) వెస్టిండీస్ ప‌రాజ‌యం పాలైంది.

చివ‌రి వ‌ర‌కు విండీస్ అద్బుతంగా పోరాడ‌న‌ప్ప‌ట‌కి విజ‌యం మాత్రం ప్రోటీస్‌నే వ‌రించింది. తొలుత బ్యాటింగ్ చేసిన క‌రేబియ‌న్లు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 135 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. అనంత‌రం స్వ‌ల్ప ల‌క్ష్య చేధ‌న‌లో ద‌క్షిణాఫ్రికా 15 ప‌రుగుల‌కే రెండు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది.

ఆ స‌మ‌యంలో వ‌ర్షం అంత‌రాయం క‌లిగించడంతో ప్రోటీస్ ల‌క్ష్యాన్ని 17 ఓవ‌ర్ల‌లో 123 ప‌రుగుల‌కు కుదించారు. అయితే మ్యాచ్ తిరిగి ప్రారంభమ‌య్యాక ద‌క్షిణాఫ్రికా వికెట్ల ప‌త‌నం కొన‌సాగింది.

చివ‌రికి ఆల్‌రౌండర్ మార్కో జానెస‌న్ 21 ప‌రుగుల‌తో ఆజేయంగా నిలిచి ద‌క్షిణాఫ్రికాను సెమీస్‌కు చేర్చాడు. ఇక ఓటమిపై మ్యాచ్ అనంత‌రం వెస్టిండీస్ కెప్టెన్ రావెమ‌న్ పావెల్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కార‌ణంగానే ఓట‌మిపాలైమని పావెల్ తెలిపాడు.

"ఈ మ్యాచ్‌లో ఓట‌మి మ‌మ్మ‌ల్ని తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. కానీ ఆఖ‌రి వ‌ర‌కు పోరాడినందుకు మా బాయ్స్‌కు క్రెడిట్ ఇవ్వాల‌న‌కుంటున్నాను. మేము ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో దారుణంగా విఫ‌ల‌మ‌య్యాం. మిడిల్ ఓవ‌ర్ల‌లో ప‌రుగులు సాధించ‌లేక‌పోయాము.

స‌రైన భాగ‌స్వామ్యాలు నెల‌కొల్ప‌క‌పోవ‌డంతో నామ‌మాత్ర‌పు స్కోర్‌కే ప‌రిమిత‌మయ్యాం. కానీ  135 పరుగులను కాపాడుకోగలమ‌ని మా బౌల‌ర్లు విశ్వసించారు. అందుకు త‌గ్గ‌ట్టు చివ‌రివ‌రకు త‌మ వంతు ప్ర‌య‌త్నం చేశారు. 

మేము సెమీఫైనల్‌కు చేరుకోపోవ‌చ్చు గానీ గ‌త 12 నెలల‌గా మేము బాగా ఆడుతున్నాం.  ఈ టోర్నీలోమాకు అభిమానుల నుంచి విశేష‌మైన ఆద‌ర‌ణ ల‌భించింది. ఇది నిజంగా మాకు చాలా సంతోషాన్నిచ్చింది. మాకు మ‌ద్దతుగా నిలిచిన అభిమానులంద‌రికి ధ‌న్య‌వాదాలని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేష‌న్‌లో పావెల్ పేర్కొన్నాడు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)