Breaking News

వాళ్లిద్దరిలో అత్యుత్తమ స్పిన్నర్‌ ఎవరు?.. కుండబద్దలు కొట్టేసిన లారా

Published on Wed, 07/16/2025 - 16:37

క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ స్పిన్నర్లుగా పేరొందారు శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ (Muttiah Muralitharan).. ఆస్ట్రేలియా లెజెండ్‌ షేన్‌ వార్న్‌ (Shane Warne). మూడు ఫార్మాట్లలో కలిపి ఏకంగా 1347 వికెట్లు కూల్చి అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్నాడు ముత్తయ్య మురళీధరన్‌.

మరోవైపు.. 1001 వికెట్లతో అతడి తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు దివంగత షేన్‌ వార్న్‌. సమకాలీన బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఈ ఇద్దరు స్పిన్‌ బౌలర్లలో ఎవరు అత్యుత్తమం అంటే చెప్పడం కాస్త కష్టమే. వెస్టిండీస్‌ దిగ్గజ బ్యాటర్‌ బ్రియన్‌ లారా కూడా ఇదే మాట అంటున్నాడు. అయితే, షేన్‌ వార్న్‌- ముత్తయ్య మురళీధరన్‌లలో ఒకరు మాత్రం ఇంకాస్త బెస్ట్‌ అంటూ తన మనసులోని మాట చెప్పేశాడు.

ఇద్దరూ ఇద్దరే
ఈ మేరకు.. ‘‘మురళి బౌలింగ్‌ చేస్తున్నపుడు నన్ను గందరగోళానికి గురిచేస్తాడు. స్వీప్‌ షాట్‌ లేదంటే.. డీప్‌ బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌ మీదుగా షాట్‌ బాదాలని అనుకుంటే.. అతడు నన్ను కన్‌ఫ్యూజ్‌ చేస్తాడు. మరోసారి నేను స్వీప్‌ షాట్‌ ఆడాలని అనుకున్నపుడు సడన్‌గా ఇంకో డెలివరీతో ముందుకు వస్తాడు.

సర్లే నా వ్యూహం మార్చుకుందామని అనుకుంటే.. తను ఊహించని రీతిలో అటాక్‌ చేస్తాడు. లారా అయినా.. ఎవరైనా సరే ఆ బ్యాటర్‌ వికెట్‌ పడగొట్టాలనేదే అతడి లక్ష్యం. ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడంలో షేన్‌ వార్న్‌ దిట్ట. అయితే, నా వరకు మురళీ.. వార్న్‌ కంటే ఎక్కువగా ఒత్తిడిలోకి నెట్టేస్తాడు.

అతడికే ఎక్కువ రేటింగ్‌
అయితే, షేన్‌ వార్న్‌ బౌలింగ్‌లో.. ముఖ్యంగా మధ్యాహ్నం 2-3 గంటల సమయంలో అతడు అద్భుతమైన స్పెల్‌తో మాయాజాలం చేయగలడు. తనలా ఇంకెవరూ మ్యాజికల్‌ స్పెల్‌ వేయలేరు. కాబట్టి నేను ఈ ఇద్దరిలో వార్న్‌కు ఎక్కువ రేటింగ్‌ ఇస్తాను.

ఎందుకంటే.. మానసికంగానూ అతడు చాలా బలవంతుడు. తనకు అనుకూలించే పిచ్‌ల మీద ఆత్మవిశ్వాసంతో దూకుడు ప్రదర్శించగల సత్తా అతడి సొంతం. అతడొక ప్రత్యేకమైన బౌలర్‌’’ అంటూ బ్రియన్‌ లారా తన ఓటును షేన్‌ వార్న్‌కే వేశాడు.

‘ది ఓవర్‌లాప్‌ క్రికెట్‌’ షోలో ఈ మేరకు అత్యుత్తమ స్పిన్నర్‌ ఎవరన్న అంశంపై లారా తన మనసులోని మాటను కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పేశాడు. కాగా 52 ఏళ్ల వయసులో షేన్‌ వార్న్‌ ఆకస్మికంగా మృతి చెందిన విషయం విదితమే. మార్చి 4, 2022లో థాయ్‌లాండ్‌ పర్యటనలో ఉన్నపుడు గుండెపోటుతో అతడు మరణించాడు.

ఇక మేటి బ్యాటర్లలో ఒకడైన బ్రియన్‌ లారా.. టెస్టుల్లో క్వాడ్రపుల్‌ సెంచరీ (400)తో ఆల్‌టైమ్‌ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటికీ ఈ రికార్డును ఎవరూ బ్రేక్‌ చేయలేకపోయారు. కాగా లారా 1990- 2007 వరకు విండీస్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాడు. తన కెరీర్‌లో మొత్తంగా 131 టెస్టుల్లో 11953 పరుగులు, 299 వన్డేల్లో 10405 పరుగులు సాధించాడు. టెస్టుల్లో 34 సెంచరీలు, 9 డబుల్‌ సెంచరీలు చేసిన లారా ఖాతాలో... 19 వన్డే శతకాలు కూడా ఉన్నాయి.

చదవండి: జడేజా దూకుడుగా ఆడాల్సింది!.. టీమిండియా దిగ్గజాలకు ఇచ్చిపడేసిన పుజారా

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)