Breaking News

గత మూడేళ్లు కష్టకాలం..! రీ ఎంట్రీలో అదుర్స్‌

Published on Tue, 11/12/2024 - 07:40

పోర్ట్‌ ఎలిజబెత్‌: మూడేళ్ల క్రితం వరుణ్‌ చక్రవర్తి ‘మిస్టరీ స్పిన్నర్‌’గా గుర్తింపు తెచ్చుకొని భారత జట్టులోకి ఎంపికయ్యాడు. శ్రీలంకతో టి20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లలో పొదుపైన బౌలింగ్‌ ప్రదర్శన కనబర్చడంతో కొద్ది రోజులకే యూఏఈలో జరిగిన టి20 వరల్డ్‌ కప్‌లో ఆడే అవకాశం కూడా దక్కింది. 

అయితే 3 మ్యాచ్‌లలో కలిపి 11 ఓవర్లలో ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు! దాంతో అతను తీవ్ర విమర్శలపాలై సెలక్టర్ల నమ్మకం కోల్పోయాడు. జట్టులో స్థానం చేజార్చుకున్న అతను ఐపీఎల్‌లో మాత్రం ఆకట్టుకున్నాడు. 2024 ఐపీఎల్‌లో మళ్లీ సత్తా చాటి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టైటిల్‌ విజయంలో కీలకపాత్ర పోషించడంతో ఎట్టకేలకు మళ్లీ టీమిండియా చాన్స్‌ లభించింది.

పునరాగమంలో ఆడిన 5 టి20ల్లో కలిపి 13 వికెట్లతో వరుణ్‌ సత్తా చాటాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో రెండో టి20 మ్యాచ్‌లో 5 వికెట్ల ప్రదర్శనతో చెలరేగిన అతను తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ‘వైఫల్యాలు వచ్చిన తర్వాత నేను మళ్లీ నా ఆటలో మూలాలకు వెళ్లిపోయాను. నా వీడియోలు చూసి లోపాలేమిటో తెలుసుకునే ప్రయత్నం చేశా. నా సైడ్‌ స్పిన్‌ బౌలింగ్‌ అంతర్జాతీయ స్థాయిలో పనికి రాదని అర్థమైంది.

 అందుకే నా బౌలింగ్‌లో సమూల మార్పులు చేసుకున్నాను. దానికి రెండేళ్లు పట్టింది. ఐపీఎల్‌తో పాటు స్థానిక లీగ్‌లలో అది మంచి ఫలితాలు ఇవ్వడంతో దానినే ఇక్కడా కొనసాగించాను. ఆదివారం మ్యాచ్‌లో నా శైలికి పిచ్‌ కూడా సహకరించింది. ఇకపై కూడా ఇలాగే రాణించాలని కోరుకుంటున్నా’ అని వరుణ్‌ స్పందించాడు. 

మూడేళ్ల క్రితం భారత జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత తన పరిస్థితి బాగా ఇబ్బందికరంగా మారిందని అతను గుర్తు చేసుకున్నాడు. దానిని కష్టకాలంగా అతను పేర్కొన్నాడు. ‘గత మూడేళ్లు చాలా కఠినంగా సాగాయి. ఆపై మరింత ఎక్కువ క్రికెట్‌ ఆడటమే నేను చేయగలిగిందని అర్థమైంది.

అందుకే టీఎన్‌పీఎల్‌ వంటి దేశవాళీ లీగ్‌లలో పాల్గొన్నా. అది నా ఆటను మరింత అర్థం చేసుకునేందుకు, ఆపై మెరుగు పర్చుకునేందుకు ఉపకరించింది’ అని వరుణ్‌ చెప్పాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో సిరీస్‌ ఆడిన సమయంలో హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ తన బాధ్యతలపై స్పష్టత ఇవ్వడం మేలు చేసిందని అతను అన్నాడు. ‘నువ్వు 30–40 పరుగులు ఇచ్చినా సరే ఆందోళన చెందవద్దు. వికెట్ల తీయడమే నీ పని అంటూ నా బాధ్యత ఏమిటో గంభీర్‌ స్పష్టంగా చెప్పారు. అది మంచి చేసింది’ అని ఈ స్పిన్నర్‌ వ్యాఖ్యానించాడు. 
చదవండి: ICC CT 2025: టీమిండియా లేకుంటే చాంపియన్స్‌ ట్రోఫీ లేనట్లే!

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)