Breaking News

‘ధోనితో నాకు మాటల్లేవు.. పదేళ్లకు పైగానే అయింది.. అయినా అలాంటి వాళ్లకు’

Published on Wed, 12/04/2024 - 16:45

‘‘లేదు.. నేను ధోనితో మాట్లాడటం లేదు. చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఆడినపుడు.. అప్పుడప్పుడు ఆట గురించి మాట్లాడుకునేవాళ్లం. అయితే, ధోనితో మనసు విప్పి మాట్లాడి పదేళ్లకు పైగానే అయింది. ఇందుకు నా దగ్గర ప్రత్యేక కారణమంటూ ఏదీ లేదు.

ఎప్పుడూ నా గదికి వచ్చేవాడు కాదు
బహుశా ధోని దగ్గర రీజన్‌ ఉండవచ్చు. అయితే, ఆ కారణం ఏమిటో నాకు మాత్రం తెలియదు. సీఎస్‌కేతో ఉన్నపుడు కూడా మైదానంలో మాత్రం అప్పుడప్పుడు మాట్లాడేవాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత అతడు ఎప్పుడూ నా గదికి వచ్చేవాడు కాదు. నేను కూడా అతడి గదికి వెళ్లేవాడిని కాదు.

ధోని పట్ల నాకెలాంటి వ్యతిరేక భావం లేదు. కానీ అతడికి నా మీద ఏదైనా కోపం ఉందేమో! ఒకవేళ అదే నిజమైతే అతడు ఆ విషయం గురించి నాతో మాట్లాడవచ్చు. నేనెప్పుడూ అతడికి కనీసం కాల్‌ కూడా చేయలేదు. ఎందుకంటే.. నేను ఫోన్‌ చేసినపుడు లిఫ్ట్‌ చేసి మాట్లాడితేనే మరోసారి ఫోన్‌ చేయాలనిపిస్తుంది.

అలాంటి వాళ్లతో నేనెందుకు మాట్లాడాలి?
లేదంటే.. అటువంటి వాళ్లను నేను అస్సలు పట్టించుకోను. ఎందుకంటే బంధం అనేది రెండువైపులా ఉండాలి. మనం ఎదుటివారికి గౌరవం ఇస్తేనే.. మనకు కూడా గౌరవం దక్కుతుంది. నేను రెండుసార్లు ఫోన్‌ చేసినా.. అటువైపు నుంచి స్పందన లేకపోతే.. నేనెందుకు అలాంటి వ్యక్తితో మాట్లాడతా!’’ అంటూ టీమిండియా దిగ్గజ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు.

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, మూడు ఐసీసీ టైటిళ్లు గెలిచిన మహేంద్ర సింగ్‌ ధోనితో తన అనుబంధం గురించి మాట్లాడుతూ ఈ మేర వ్యాఖ్యలు చేశాడు. తామిద్దరి మధ్య మాటలులేక దశాబ్దకాలం గడిచిందన్నాడు భజ్జీ. తాను మాట్లాడేందుకు ప్రయత్నించినా ధోని నుంచి స్పందన లేకపోవడంతో తాను కూడా అతడికి దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నట్లు భజ్జీ తెలిపాడు.

అదంతా నిజమే
కాగా ధోని- భజ్జీ మధ్య విభేదాలున్నాయంటూ గతంలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా క్రికెట్‌నెక్స్ట్‌తో మాట్లాడిన హర్భజన్‌ సింగ్‌ అదంతా నిజమేనని ధ్రువీకరించాడు. కాగా 2007లో ధోని సారథ్యంలో టీ20 ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో.. అదే విధంగా.. ధోని కెప్టెన్సీలోనే 2011 వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన టీమిండియాలోనూ హర్భజన్‌ సింగ్‌ సభ్యుడు. 

అంతేకాదు.. 2018 నుంచి 2020 వరకు ధోని నాయకత్వంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున భజ్జీ ఆడటం గమనార్హం. అయితే, వీరిద్దరి బంధం బీటలు వారడానికి గల కారణంపై మాత్రం స్పష్టత లేదు. 

చదవండి: Asia Cup 2024: టీమిండియా ఓపెనర్ల ఊచకోత.. సెమీ ఫైనల్లో భారత్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)