Breaking News

నేనెవరినీ స్లెడ్జ్ చేయను.. అది నా అలవాటు కాదు: కోహ్లితో గొడవపడ్డ నవీన్‌ ఉల్‌ హక్‌

Published on Fri, 05/12/2023 - 19:28

IPL 2023: కొద్ది రోజుల క్రితం ఆర్సీబీతో మ్యాచ్‌ సందర్భంగా ఆ జట్టు స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లితో గొడవపడిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఫాస్ట్‌ బౌలర్‌ నవీన్‌ ఉ‍ల్‌ హక్‌, తాజాగా సహచరుడు ఆవేశ్‌ ఖాన్‌తో జరిగిన ఓ చాట్‌ షోలో (ఎక్‌దమ్‌ టైట్‌, ఎక్‌దమ్‌ రైట్‌ బై బాండ్‌ టైట్‌) ఆసక్తికర వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు. సరదాగా సాగిన ఆవేశ్‌-నవీన్‌ ఉల్‌ హక్‌ మధ్య సంభాషణను ఎల్‌ఎస్‌జీ తమ అధికారిక సోషల్‌మీడియా ఖాతాల్లో షేర్‌ చేయగా ప్రస్తుతం వైరలవుతుంది.

ఆవేశ్‌-నవీన్‌ ఒకరినొకరు ప్రశ్నలు సంధించుకున్న ఈ షోలో స్లెడ్జింగ్‌ గురించిన ఓ ప్రశ్నను ఆవేశ్‌.. నవీన్‌ను అడిగాడు. ఫీల్డ్‌లో నువ్వు చేసిన లేదా ఎదుర్కొన్న ఫేవరెట్‌ స్లెడ్జ్‌ ఏంటని ఆవేశ్‌..నవీన్‌ను అడిగాడు. దీనికి నవీన్‌ ఠక్కున స్పందిస్తూ.. నేనెవరిని ముందుగా స్లెడ్జింగ్‌ చేయను.. అది నా అలవాటు కాదు అని అన్నాడు. దీనికి ఆవేశ్‌ కచ్చితంగా సమాధానం చెప్పాలన్నట్లుగా పట్టుబట్టడంతో నవీన్‌ ఏదో సొల్లు చెప్పే ప్రయత్నం చేశాడు.

ఓ ఫస్ట్‌ క్లాస్‌ గేమ్‌ సందర్భంగా నాతో పాటు క్రీజ్‌లో ఉన్న బ్యాటర్‌ను ఫీల్డర్‌ స్లెడ్జ్‌ చేశాడని, కొత్తగా పెళ్లి చేసుకున్న ఆ ఫీల్డర్‌.. ఇదే లాస్ట్‌ వికెట్, త్వరగా ఔట్‌ చేస్తే నేను ఇంటికి వెళ్లాలి, నాకు నిన్ననే పెళ్లైంది అని స్లెడ్జ్‌ చేశాడంటూ పస లేని విషయాన్ని స్లెడ్జింగ్‌ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ మధ్యలో ఆవేశ్‌ కలగజేసుకుని.. ఇది ఫన్నీ ఇన్సిడెంట్‌, సీరియస్‌గా జరిగిన స్లెడ్జింగ్‌ గురించి చెప్పు అంటూ పట్టుబట్టాడు.

దీనికి నవీస్‌ స్పందిస్తూ.. సీరియస్‌గా జరిగినవి ఏవీ లేవని బదులిచ్చాడు. నవీన్.. కోహ్లితో జరిగిన వివాదం ప్రస్తావన తేకపోవడంతో వీరి మధ్య సంధి కుదిరిందని నెటిజన్లు అనుకుంటున్నారు. అయితే కోహ్లి-నవీన్‌-గంభీర్‌ల మధ్య గొడవ పూర్తయ్యాక చాలా రోజుల పాటు ఈ ముగ్గురి మధ్య (కోహ్లితో గంభీర్‌, నవీన్‌) సోషల్‌మీడియా వార్‌ జరిగిన విషయం తెలిసిందే. దూకుడుగా ఉండే కోహ్లి, గంభీర్‌లు ఎప్పుడు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

ఇదిలా ఉంటే, ప్రస్తుత సీజన్‌లో లక్నో, ఆర్సీబీల పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. ఈ రెండు జట్లు ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే తదుపరి ఆడబోయే అన్ని మ్యాచ్‌ల్లో (3) గెలవాల్సి ఉంది. ప్రస్తుతం లక్నో, ఆర్సీబీ 11, 10 పాయింట్లతో  పాయింట్ల పట్టికలో 5, 6 స్థానాల్లో కొనసాగుతున్నాయి.

చదవండి: వాళ్లిద్దరు అద్భుతం.. రోహిత్‌, కోహ్లి పనైపోయింది: టీమిండియా మాజీ క్రికెటర్‌
 

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)