Breaking News

టీపీఎల్‌ విజేత హైదరాబాద్‌ స్ట్రయికర్స్‌

Published on Tue, 12/10/2024 - 10:02

ముంబై: టెన్నిస్‌ ప్రీమియర్‌ లీగ్‌ (టీపీఎల్‌)లో హైదరాబాద్‌ స్ట్రయికర్స్‌ జట్టు చాంపియన్‌గా నిలిచింది. యశ్‌ ముంబై ఈగల్స్‌ జట్టుతో జరిగిన ఫైనల్లో హైదరాబాద్‌ స్ట్రయికర్స్‌ 51–44 పాయింట్లతో గెలిచి మూడోసారి ఈ టైటిల్‌ను సొంతం చేసుకుంది. హరీట్‌ డార్ట్, బెంజమిన్‌ లాక్, ఒలింపియన్‌ విష్ణువర్ధన్‌లతో కూడిన హైదరాబాద్‌ స్ట్రయికర్స్‌ జట్టుకు గ్రాస్‌కోర్టు జాతీయ మాజీ చాంపియన్‌ సురేశ్‌ కృష్ణ కోచ్‌గా వ్యవహరించాడు. 

తొలి మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో హరీట్‌ డార్ట్‌ 14–11తో జెనెప్‌ సోన్‌మెజ్‌పై గెలిచి హైదరాబాద్‌కు శుభారంభం అందించింది. రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో కరణ్‌ సింగ్‌ (ముంబై) 14–11తో బెంజమిన్‌ లాక్‌పై గెలిచాడు. మూడో మ్యాచ్‌గా జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌లో విష్ణువర్ధన్‌–హరీట్‌ డార్ట్‌ ద్వయం 16–9తో జెనెప్‌ సోన్‌మెజ్‌–జీవన్‌ నెడుంజెళియన్‌ జోడీని ఓడించింది. జీవన్‌ నెడుంజెళియన్‌–కరణ్‌ (ముంబై)... విష్ణువర్ధన్‌–బెంజమిన్‌ లాక్‌ (హైదరాబాద్‌) జోడీల మధ్య నాలుగో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌ పోరు 10–10తో ‘టై’గా ముగియడంతో హైదరాబాద్‌ స్ట్రయికర్స్‌ జట్టుకు టైటిల్‌ ఖరారైంది.    

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)