Breaking News

రాణించిన వరుణ్, రోహిత్‌ రాయుడు

Published on Wed, 09/03/2025 - 02:40

చెన్నై: వరుసగా రెండో ఏడాది ఆలిండియా బుచ్చిబాబు ఇన్విటేషన్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లేందుకు డిఫెండింగ్‌ చాంపియన్‌ హైదరాబాద్‌ జట్టు మరో ఎనిమిది వికెట్ల దూరంలో ఉంది. హరియాణాతో జరుగుతున్న నాలుగు రోజుల సెమీఫైనల్‌ మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్‌దే పైచేయిగా ఉంది. హైదరాబాద్‌ నిర్దేశించిన 272 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హరియాణా ఆట ముగిసే సమయానికి 4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 6 పరుగులు చేసింది. 

హరియాణా చేజార్చుకున్న రెండు వికెట్లు నితిన్‌ సాయి యాదవ్‌కు లభించాయి. చివరిరోజు బుధవారం విజయం అందుకోవాలంటే హరియాణా మరో 266 పరుగులు చేయాలి. హైదరాబాద్‌ నెగ్గాలంటే ఎనిమిది వికెట్లు తీయాలి. అంతకుముందు హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో 80 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. వరుణ్‌ గౌడ్‌ (41; 3 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలువగా... హిమతేజ (31; 2 ఫోర్లు), రాహుల్‌ రాదేశ్‌ (31; 1 ఫోర్‌) కూడా రాణించారు. హరియాణా బౌలర్లలో అమిత్‌ రాణా మూడు వికెట్లు తీయగా... నిఖిల్‌ కశ్యప్, పార్థ్‌ వత్స్‌ రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు. 

హరియాణా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 79.3 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌటైంది. కెపె్టన్‌ హిమాన్షు రాణా (75; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. హైదరాబాద్‌ బౌలర్లు రోహిత్‌ రాయుడు 65 పరుగులిచ్చి 5 వికెట్లు... వరుణ్‌ గౌడ్‌ 27 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టి హరియాణాను కట్టడి చేశారు. 17 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన హైదరాబాద్‌ 99.4 ఓవర్లలో 254 పరుగులకు ఆలౌటైంది. 

వరుణ్‌ గౌడ్‌ (91; 4 ఫోర్లు) తొమ్మిది పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకోగా... హిమతేజ (41; 3 ఫోర్లు), అమన్‌ రావు (35; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆకట్టుకున్నారు. హరియాణా బౌలర్లలో నిఖిల్‌ కశ్యప్‌ 80 పరుగులిచ్చి 5 వికెట్లు... పార్థ్‌ వత్స్‌ 49 పరుగులిచ్చి 3 వికెట్లు తీశారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)