హైదరాబాద్‌కు రెండో విజయం

Published on Mon, 12/15/2025 - 02:27

పుణే: ముస్తాక్‌ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్‌ టోర్నీ ‘సూపర్‌ లీగ్‌’ దశలో హైదరాబాద్‌ జట్టు రెండో విజయంతో ఫైనల్‌కు చేరువైంది. రాజస్తాన్‌ జట్టుతో ఆదివారం జరిగిన గ్రూప్‌ ‘బి’ రెండో లీగ్‌ మ్యాచ్‌లో సీవీ మిలింద్‌ సారథ్యంలోని హైదరాబాద్‌ జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత రాజస్తాన్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 178 పరుగులు సాధించింది. 

మహిపాల్‌ లొమ్రోర్‌ (35 బంతుల్లో 48; 1 ఫోర్, 4 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. హైదరాబాద్‌ బౌలర్లలో మొహమ్మద్‌ సిరాజ్‌ (2/23), సీవీ మిలింద్‌ (3/25), తనయ్‌ త్యాగరాజన్‌ (3/38) రాణించారు. అనంతరం హైదరాబాద్‌ జట్టు ధాటిగా ఆడుతూ 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసి విజయం సాధించింది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ తన్మయ్‌ అగర్వాల్‌ (41 బంతుల్లో 73; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), రాహుల్‌ బుద్ధి (36 బంతుల్లో 55; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాజస్తాన్‌ బౌలర్ల భరతం పట్టి అర్ధ సెంచరీలతో మెరిపించారు. నాలుగు జట్లున్న గ్రూప్‌ ‘బి’లో ప్రస్తుతం హైదరాబాద్‌ 8 పాయింట్లతోపాటు 2.999 రన్‌రేట్‌తో అగ్రస్థానంలో ఉంది. 

హరియాణా (4 పాయింట్లు; 0.234 రన్‌రేట్‌), ముంబై (4 పాయింట్లు; –0.371 రన్‌రేట్‌) సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. మంగళవారం జరిగే చివరి రౌండ్‌ మ్యాచ్‌ల్లో హరియాణాతో హైదరాబాద్‌; రాజస్తాన్‌తో ముంబై తలపడతాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)