Breaking News

అండర్‌–19 క్రికెట్‌ ప్రపంచకప్‌ గెలుపులో నగర కుర్రోడు

Published on Sun, 02/08/2026 - 08:29

మల్లాపూర్‌/కాప్రా: హైదరాబాద్‌ బ్యాట్స్‌మెన్‌కు ప్రత్యేకమైన మణికట్టు మాయాజాలంతో పరుగులు సాధించి.. భారత జట్టు అండర్‌ 19 ప్రపంచ కప్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు నగరానికి చెందిన కుర్రాడు అరోన్‌ జార్జి. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా డ్రైవ్‌లు కొడుతూ.. అంతకుమించిన స్ట్రోక్‌ ప్లేతో అలరిస్తూ.. టైమింగ్‌లో మైమరిపిస్తూ.. ఫ్లిక్‌లతో కట్టిపడేస్తూ.. హైదరాబాద్‌ క్రికెట్‌ స్టయిల్‌ను ప్రపంచానికి చాటాడు. బిహార్‌కు చెందిన మరో ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీతో కలిసి టీమ్‌ఇండియా జగజ్జేతగా నిలవడంలో తనవంతు బాధ్యత నెరవేర్చాడు. బంతిని అడ్డంగా బాదేసే ఈ టి20ల కాలంలో.. క్లాస్‌ బ్యాటింగ్‌తో అరోన్‌ అదరహో అనిపించాడు.  

మన మల్లాపూర్‌ వాడే.. అరుదైన రికార్డు 
మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మల్లాపూర్‌లో నివసిస్తోంది అరోన్‌ జార్జి కుటుంబం. తల్లిదండ్రులు ఇసో వర్గీస్, ప్రీతీ వర్గీస్‌. కేరళకు చెందినవారైనా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అరోన్‌ అండర్‌–19 హైదరాబాద్‌ జట్టు కెప్టెన్‌ కూడా. ప్రపంచ కప్‌లో అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన సెమీఫైనల్‌లో క్లిష్ట పరిస్థితుల్లో అరోన్‌ సెంచరీ (115) బాది జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. లీగ్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా (118)పైనా సెంచరీ కొట్టాడు. స్కాట్లాండ్‌పై 61 పరుగుల చక్కని ఇన్నింగ్స్‌ ఆడాడు. 

నగరం నుంచి అంబటి రాయుడు, తిలక్‌ వర్మ వంటి మేటి బ్యాటర్లు అండర్‌–19 క్రికెట్‌లో సెంచరీలు కొట్టినా.. ప్రపంచకప్‌లో మాత్రం ఆ ఘనతను అందుకోలేదు. ఇప్పుడు అరోన్‌ ఏకంగా రెండు సెంచరీలు కొట్టి.. టి20 ప్రపంచకప్‌లో సెంచరీలు బాదిన తొలి హైదరాబాదీగా రికార్డులకెక్కాడు. అరోన్‌ ప్రస్తుతం సైనిక్‌పురి భవన్స్‌ కాలేజీలో బీకాం (ఫైనాన్స్‌) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో 2014–17 వరకు ఉచిత శిక్షణ పొందాడు. తార్నాకలోని అకాడమీలో ఆ తర్వాత మూడేళ్లు శిక్షణ తీసుకున్నాడు. సంగీత్‌ చౌరస్తాలోని అకాడమీలో గత ఏడాది వరకు ప్రాక్టీస్‌ చేశాడు. టీమ్‌ఇండియా మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌ పర్యవేక్షణలో కోచింగ్‌ తీసుకున్నాడు.  

‘సాక్షి’తో తల్లిదండ్రుల సంతోషం 
తండ్రి ఈసో వర్గీస్‌ రిటైర్డ్‌ పోలీస్‌ అధికారి. తల్లి ప్రీతి.. తమ కుమారుడు సాధించిన ఘనతను ‘సాక్షి’తో పంచుకున్నారు. అఫ్ఘాన్‌పై తమ కుమారుడి సెంచరీని చూసి అంతులేని సంతోషం కలిగిందని తెలిపారు. భవిష్యత్‌లో జాతీయ జట్టుకు ఆడాలనేది అరోన్‌ లక్ష్యంగా వివరించారు. కాగా, ఆదివారం సాయంత్రం శంషాబాద్‌ రానున్న అరోన్‌కు ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్వాగతం పలకనున్నారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)