Breaking News

విచిత్రరీతిలో రనౌట్‌ అయిన పాక్‌ బ్యాటర్‌

Published on Thu, 06/08/2023 - 17:57

పాకిస్తాన్‌ ఆటగాడు హైదర్‌ అలీ విచిత్రరీతిలో స్టంపౌట్‌ అవ్వడం ఆసక్తి కలిగించింది. విటాలిటీ టి20 బ్లాస్ట్ టోర్నీలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయంలోకి వెళితే.. స్పిన్నర్ బ్రిగ్స్ వేసిన ఫుల్ లెన్త్ బంతిని బాదేందుకు క్రీజులో నుంచి బయటికి వచ్చి బీట్ అయ్యాడు హైదర్. అయితే, బంతిని పట్టడంలో మొదట బర్మింగ్‍హామ్ కీపర్ అలెక్స్ డేవియస్ తడబడ్డాడు. గ్లవ్‍లో తొలుత సరిగా ఒడిసిపట్టలేకపోయి, రెండో ప్రయత్నంలో పట్టుకున్నాడు.

ఆలోగానే హైదర్ అలీ క్రీజులోకి వచ్చాడు. అయితే బంతి కీపర్ అలెక్స్ చేతిలో ఉందని గమనించని హైదర్ అలీ పరుగులు తీసేందుకు క్రీజు దాటి మళ్లీ ముందుకు పరుగెత్తాడు. ఆ సమయంలో వికెట్లను గిరాటేశాడు కీపర్ అలెక్స్. దీంతో షాకైన హైదర్ అలీ (48 పరుగులు).. స్టంపౌట్‍గా పెవిలియన్ చేరాడు.

హైదర్ అలీ స్టంపౌట్ అయిన వీడియోను విటాలిటీ బ్లాస్ట్.. ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు. కొందరు హైదర్ అలీని ట్రోల్ చేస్తున్నారు. హైదర్ మందు కొట్టినట్టున్నాడంటూ ఓ యూజర్ సరదాగా కామెంట్ చేశారు. అతడి కెరీర్‌లాగే హైదర్ అలీ తికమకపడ్డాడని మరో యూజర్ రాసుకొచ్చారు. అలీ దిమ్మతిరిగిందని మరికొందరు ట్రోల్ చేశారు.

ఈ మ్యాచ్‍లో డెర్బీషైర్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బర్మింగ్‍హామ్ బియర్స్ 7 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. అనంతరం ఈ లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో డెర్బీషైర్ చేజ్ చేసింది. డెర్బీ షైర్ కెప్టెన్ డు ప్లూయీ (25 బంతుల్లో 66, నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. సిక్సర్ల మోత మోగించి చివరి వరకు ఉండి సత్తాచాటాడు.

చదవండి: సిరాజ్‌కు కోపం తెప్పించిన స్మిత్‌ చర్య

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు