Breaking News

పృథ్వీ షా 2.0.. సెంచరీతో కొత్త జర్నీ ప్రారంభం

Published on Tue, 08/19/2025 - 14:50

టీమిండియా యువ బ్యాటర్‌ పృథ్వీ షా కొత్త జర్నీని సెంచరీతో ప్రారంభించాడు. దేశవాలీ క్రికెట్‌లో ముంబై నుంచి మహారాష్ట్రకు మారిన షా.. అరంగేట్రం మ్యాచ్‌లోనే శతక్కొట్టి శభాష్‌ అనిపించుకున్నాడు. బుచ్చిబాబు టోర్నీలో షా ఛత్తీస్‌ఘడ్‌పై 122 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 140 బంతులు ఎదుర్కొని 111 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఈ ఇన్నింగ్స్‌లో షా యధేచ్చగా షాట్లు ఆడి కష్టాల్లో ఉన్న తన జట్టును గట్టెక్కించాడు. తొలి వికెట్‌కు సచిన్‌ దాస్‌తో కలిసి 71 పరుగులు జోడించిన అనంతరం మహారాష్ట్ర 15 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో షా ఎంతో బాధ్యతాయుతంగా ఆడి సెంచరీ పూర్తి చేసుకోవడమే కాకుండా తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు.

25 ఏళ్ల షా గత కొంతకాలంగా ఫామ్‌ లేమి, ఫిట్‌నెస్‌ సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ మధ్యలోనే అతన్ని పలు వివాదాలు కూడా చుట్టుముట్టాయి. ఈ క్రమంలోనే ముంబై రంజీ జట్టులో చోటు కోల్పోయాడు. విజయ్‌ హజారే ట్రోఫీకి కూడా ఎంపిక కాలేదు. ముంబై విజేతగా నిలిచిన ముస్తాక్‌ అలీ టోర్నీలో భాగమైనా​ చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు.

ముంబై తరఫున అవకాశాలు రావని భావించిన షా..మకాంను మహారాష్ట్రకు మార్చాడు. అరంగేట్రంలోనే అదరగొట్టాడు. కొత్త ప్రయాణాన్ని సెంచరీతో ప్రారంభించడంతో పృథ్వీ షా 2.0 వర్షన్‌ అని జనం అనుకుంటున్నారు.

టెస్ట్‌ అరంగేట్రంలోనే సెంచరీ చేసి భావి సచిన్‌గా కీర్తించబడిన షా.. కొద్దికాలంలోనే వివాదాల్లో తలదూర్చి, ఫామ్‌ కోల్పోయి, క్రమశిక్షణ లేకుండా విపరీతంగా బరువు పెరిగి చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు. 2021 జులైలో టీమిండియా తరఫున చివరిసారిగా ఆడిన షా.. ప్రస్తుతం భారత సెలెక్టర్ల పరిధిలోనే లేడు. మహారాష్ట్రతో ప్రయాణం అతన్ని టీమిండియా తలుపులు తట్టేలా చేస్తుందేమో చూడాలి. 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)