Breaking News

ఐపీఎల్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్న ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌.. మరో మెరుపు సెంచరీ

Published on Wed, 07/26/2023 - 13:34

ఐపీఎల్‌-2023లో పంజాబ్‌ కింగ్స్‌ తరఫున ఏకైక సెంచరీ చేసిన యువ ఆటగాడు ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌, ప్రస్తుతం జరుగుతున్న దియోదర్‌ ట్రోఫీలోనూ తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. గత ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 65 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో సుడిగాలి శతకం (103) బాదిన ప్రభ్‌సిమ్రన్‌.. దియోదర్‌ ట్రోఫీలో సెంట్రల్‌ జోన్‌తో ఇవాళ (జులై 26) జరుగుతున్న మ్యాచ్‌లో 92 బంతుల్లో శతక్కొట్టాడు.

ఈ ఇన్నింగ్స్‌లో 107 బంతులు ఎదుర్కొన్న ప్రభ్‌సిమ్రన్‌ (నార్త్‌ జోన్‌).. 13 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 121 పరుగులు చేశాడు. అతనికి కెప్టెన్‌ నితీశ్‌ రాణా (51), మన్‌దీప్‌ సింగ్‌ (43) తోడవ్వడంతో నార్త్‌ జోన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. ఎమర్జింగ్‌ ఏసియా కప్‌ హీరోలు అభిషేక్‌ శర్మ (19), నిషాంత్‌ సింధు (18), హర్షిత్‌ రాణా (5), వివ్రాంత్‌ శర్మ (1) నిరశపర్చగా.. హిమాన్షు రాణా (24) ఓ మోస్తరు స్కోర్‌ చేశాడు. సెంట్రల్‌ జోన్‌ బౌలర్లలో యశ్‌ ఠాకూర్‌, వెంకటేశ్‌ అయ్యర్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. శివమ్‌ మావి, కర్ణ్‌ శర్మ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. దియోదర్‌ ట్రోఫీ-2023లో ప్రభ్‌సిమ్రన్‌దే తొలి సెంచరీ కావడం విశేషం​. 

తృటిలో సెంచరీని చేజార్చుకున్న మయాంక్‌ అగర్వాల్‌..
ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో సౌత్‌ జోన్‌ కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ (115 బంతుల్లో 98; 9 ఫోర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మయాంక్‌, అరుణ్‌ కార్తీక్‌ (23), విజయ్‌కుమార్‌ వైశాఖ్‌ (20 నాటౌట్‌), కావేరప్ప (19) మినహా ఎవరూ కనీసం రెండంకెల స్కోర్లు కూడా చేయకపోవడంతో వెస్ట్‌ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌత్‌ జోన్‌ 46.4 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. వెస్ట్‌ జోన్‌ బౌలర్లలో పార్థ్‌ భట్‌ 3, షమ్స్‌ ములానీ, హంగార్గేకర్‌ చెరో 2 వికెట్లు, నగ్వస్వల్లా, అతీథ్‌ సేథ్‌, శివమ్‌ దూబే తలో వికెట్‌ పడగొట్టారు. 

Videos

చింతమనేని మోసం చేశాడు.. వాపోయిన జనసేన దెందులూరు ఇంచార్జ్ వెంకటలక్ష్మి

ప్రచారంలో దూసుకుపోతున్న YSRCP వరుదు కళ్యాణి

మార్కెట్లో జియో మెగా సునామీ.. అప్లై చేసిన వారికి షేర్లు దక్కుతాయా?

ABN రాధాకృష్ణ... నీ ఫామ్ హౌస్ బాగోతం.. కారుమూరి సంచలన కామెంట్స్

టీడీపీ నేతలకు తొడగొట్టి సవాల్ విసిరిన మహిళ.. ఇది వింటే..!

టెక్ మహీంద్రా షేర్లలో దూకుడు... 100 షేర్లకు మరో 100 ఫ్రీ

జనసేన అభ్యర్థిని చితక్కొట్టిన TDP గూండాలు

కుప్పంలో YSRCP పేరుతో TDP దొంగ నామినేషన్లు.. అడ్డంగా దొరికిపోయిన బాబు

మా పై దాడి చేస్తారా.. తేల్చుకుందాం! TDPకి జనసేన నేతలు STRONG వార్నింగ్

టికెట్లు నిల్! 70 ఏళ్ల కుర్రోడి స్టామినా.. బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు!

Photos

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్