Breaking News

రికార్డు హాఫ్‌ సెంచరీ.. తండ్రికి అంకితమిచ్చిన జోస్‌ బట్లర్‌

Published on Fri, 08/15/2025 - 09:02

ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌ ఇటీవల చనిపోయిన తన తండ్రి జాన్‌ బట్లర్‌కు ఓ అపూర్వ కానుక ఇచ్చాడు. హండ్రెడ్‌ లీగ్‌లో చేసిన రికార్డు హాఫ్‌ సెంచరీని తండ్రికి అంకితమిచ్చాడు. తండ్రి మరణం తీవ్రంగా కలచి వేస్తున్నప్పటికీ హండ్రెడ్‌ లీగ్‌లో ఆడుతున్న జోస్‌ (మాంచెస్ట‌ర్ ఒరిజిన‌ల్స్‌).. తాజాగా వెల్ష్‌ ఫైర్‌పై మెరుపు అర్ద సెంచరీ చేశాడు.

ఈ ఫీట్‌ సాధించిన అనంతరం జోస్‌ తండ్రిని స్మరించుకుంటూ.. "నాన్నా, ఇది నీ కోసమే" అన్నట్లు బ్యాట్‌ను ఆకాశానికెత్తి చూపాడు. ఈ సీన్లు క్రికెట్‌ అభిమానులను కదలించాయి. బట్లర్‌ తన తండ్రిని ఎంత మిస్‌ అవుతాన్నాడో వ్యక్తపరిచాయి.

కొద్ది రోజుల కిందటే జోస్‌ తన తండ్రి మరణ వార్తను సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేశాడు. రెస్ట్ ఇన్ పీస్ డాడ్‌, మాకు ప్ర‌తిదీ ఇచ్చినందుకు ధ‌న్య‌వాదాలు అంటూ త‌ండ్రితో క‌లిసి ఉన్న ఫోటోను ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు.

అనంతరం ఆగస్టు 9న ఓవల్ ఇన్విన్సిబుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌ సభ్యులంతా నల్లటి ఆర్మ్ బ్యాండ్‌లు ధరించి జోస్‌ తండ్రి మృతికి నివాళులు అర్పించారు. అయితే ఆ మ్యాచ్‌లో జోస్‌ నాలుగు బంతులాడి డ‌కౌట్‌గా వెనుదిరిగాడు.

రికార్డు హాఫ్‌ సెంచరీ
తాజాగా వెల్ష్‌ ఫైర్‌పై జోస్‌ చేసిన హాఫ్‌ సెంచరీ (34 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రికార్డుపుటల్లోకెక్కింది. ఈ హాఫ్‌ సెంచరీ జోస్‌కు టీ20ల్లో 94వది. దీంతో జోస్‌ పొట్టి క్రికెట్‌లో అత్యధిక హాఫ్‌ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో పాక్‌ ఆటగాడు బాబర్‌ ఆజమ్‌ను వెనక్కు నెట్టి మూడో స్థానానికి ఎగబాకాడు. 

వెల్ష్‌ ఫైర్‌తో మ్యాచ్‌లో జోస్‌ హాఫ్‌ సెంచరీతో మెరిసిరా తన జట్టును గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో ఒరిజినల్స్‌ 25 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. జోస్‌ రికార్డు హాఫ్‌ సెంచరీ వృధా అయిపోయింది. 

టీ20ల్లో అత్యధిక హాఫ్‌ సెంచరీలు చేసిన టాప్‌-5 ఆటగాళ్లు..

డేవిడ్‌ వార్నర్‌: 113 అర్ద సెంచరీలు (418 ఇన్నింగ్స్‌)
విరాట్ కోహ్లీ: 105 అర్ధ సెంచరీలు (397 ఇన్నింగ్స్)
జోస్ బట్లర్: 94 అర్ధ సెంచరీలు (436 ఇన్నింగ్స్)
బాబర్ అజామ్: 93 అర్ధ సెంచరీలు (309 ఇన్నింగ్స్)
క్రిస్ గేల్: 88 అర్ధ సెంచరీలు (455 ఇన్నింగ్స్)
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)