Breaking News

నరాలు తెగే ఉత్కంఠ.. చివరి బంతికి సిక్సర్‌.. కావ్యా మారన్‌ జట్టు సంచలన విజయం

Published on Thu, 08/14/2025 - 09:09

పురుషుల హండ్రెడ్‌ లీగ్‌లో కావ్యా మారన్‌ జట్టు నార్త్రన్‌ సూపర్‌ ఛార్జర్స్‌ సంచలన విజయం సాధించింది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ నిన్న (ఆగస్ట్‌ 13) సథరన్‌ బ్రేవ్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి బంతికి గెలుపొందింది. గెలుపుకు 5 పరుగులు కావాల్సిన తరుణంలో గ్రహం క్లార్క్‌ నమ్మశక్యం కాని రీతిలో సిక్సర్‌ బాది సూపర్‌ ఛార్జర్స్‌ను గెలిపించాడు. తైమాల్‌ మిల్స్‌ వేసిన స్లో డెలివరీని క్లార్క్‌ అద్భుతంగా ఎగ్జిక్యూట్‌ చేశాడు. 

ఈ సిక్సర్‌తో ప్రత్యర్థి హోం గ్రౌండ్‌ ఒక్కసారిగా మూగబోయింది. మైదానం మొత్తం నిశ్శబ్దం ఆవహించింది. ఈ ఓటమితో సథరన్‌ బ్రేవ్‌ వరుసగా విజయాలకు బ్రేక్‌ పడింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సథరన్‌ బ్రేవ్‌.. లారీ ఇవాన్స్‌ (53), జేమ్స్‌ కోల్స్‌ (49 నాటౌట్‌) రాణించడంతో నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. సూపర్‌ ఛార్జర్స్‌ బౌలర్లలో జేకబ్‌ డఫీ 3, మిచెల్‌ సాంట్నర్‌ 2 వికెట్లు తీశారు.

అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన సూపర్‌ ఛార్జర్స్‌.. ఆది నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ గెలుపు కష్టమన్నట్లు సాగింది. అయితే గ్రహం క్లార్క్‌ మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు. కీలక తరుణంలో 24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో అజేయమైన 38 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడికి మిచెల్‌ సాంట్నర్‌ (24) సహకరించాడు. 

అంతకుముందు జాక్‌ క్రాలే (29), హ్యారీ బ్రూక్‌ (24) ఓ మోస్తరు స్కోర్లు చేసి సూపర్‌ ఛార్జర్స్‌ను మ్యాచ్‌లో ఉంచారు. బ్రేవ్‌ బౌలర్లలో ఓవర్టన్‌ 3, జోఫ్రా ఆర్చర్‌, తైమాల్‌ మిల్స్‌ తలో 2 వికెట్లు తీశారు.  

 

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)