Breaking News

చెలరేగిన రషీద్‌ ఖాన్‌.. దారుణంగా విఫలమైన కేన్‌ విలియమ్సన్‌

Published on Wed, 08/06/2025 - 07:35

ఇంగ్లండ్‌ వేదికగా జరిగే హండ్రెడ్‌ లీగ్‌ నిన్న (ఆగస్ట్‌ 5) ప్రారంభమైంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఓవల్‌ ఇన్విన్సిబుల్స్‌, లండన్‌ స్పిరిట్‌ పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఇన్విన్సిబుల్స్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన లండన్‌ స్పిరిట్‌.. ఇన్విన్సిబుల్స్‌ బౌలర్లు రషీద్‌ ఖాన్‌ (20-15-11-3), సామ్‌ కర్రన్‌ (19-10-18-3), జోర్డన్‌ క్లార్క్‌ (10-6-8-2) చెలరేగడంతో 94 బంతుల్లో 80 పరుగులకే కుప్పకూలింది. బెహ్రెన్‌డార్ఫ్‌, నాథన్‌ సౌటర్‌ తలో వికెట్‌ తీశారు.

దారుణంగా విఫలమైన డేవిడ్‌ వార్నర్‌, కేన్‌ విలియమ్సన్‌
లండన్‌ ఇన్నింగ్స్‌లో ఆస్టన్‌ టర్నర్‌ (21), ర్యాన్‌ హిగ్గిన్స్‌ (12), మ్యాడ్‌సన్‌ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అంతర్జాతీయ స్టార్లు డేవిడ్‌ వార్నర్‌ (9), కేన్‌ విలియమ్సన్‌ (9) దారుణంగా విఫలమయ్యారు.

ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరిన ఇన్విన్సిబుల్స్‌
అనంతరం 81 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుక బరిలోకి దిగిన ఇన్విన్సిబుల్స్‌ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. విల్‌ జాక్స్‌ 24, సామ్‌ కర్రన్‌ 14 పరుగులు చేసి ఇన్విన్సిబుల్స్‌ను గెలిపించారు. ఈ జట్టు కేవలం​ 69 బంతుల్లోనే (4 వికెట్లు కోల్పోయి) లక్ష్యాన్ని చేరుకుంది. సామ్‌ బిల్లింగ్స్‌ 6, డొనొవన్‌ ఫెరియెరా 9 పరుగులతో అజేయంగా నిలిచారు. లండన్‌ బౌలర్లలో డాసన్‌ 2, వార్రల్‌, టర్నర్‌ తలో వికెట్‌ తీశారు.

మైదానంలోకి గుంట నక్క
ఈ మ్యాచ్‌ జరుగుతుండగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇన్విన్సిబుల్స్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా మైదానంలోకి ఓ గుంట నక్క ప్రవేశించింది. ఈ నక్క మైదానమంతా పరుగులు పెడుతూ కాసేపు హల్‌చల్‌ చేసింది. దీంతో మ్యాచ్‌కు పాక్షిక అంతరాయం కలిగింది. 
 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)