Breaking News

చెలరేగిన బ్రూక్‌, క్రాలే.. కావ్యా మారన్‌ జట్టుకు తొలి గెలుపు

Published on Fri, 08/08/2025 - 07:53

ద హండ్రెడ్‌ లీగ్‌-2025లో కావ్యా మారన్‌ (సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓనర్‌) ఓనర్‌షిప్‌లోని నార్త్రన్‌ సూపర్‌ ఛార్జర్స్‌ తొలి విజయం సాధించింది. నిన్న (ఆగస్ట్‌ 7) వెల్ష్‌ఫైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వెల్ష్‌ఫైర్‌ నిర్ణీత 100 బంతుల్లో 9 వికెట్ల నస్టానికి 143 పరుగులు చేసింది. 

వెల్ష్‌ఫైర్‌ ఇన్నింగ్స్‌లో జానీ బెయిర్‌స్టో (42), స్టీవ్‌ స్మిత్‌ (29) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. కెప్టెన్‌ టామ్‌ ఏబెల్‌ 18, లూక్‌ వెల్స్‌ 0, టామ్‌ కొహ్లెర్‌ కాడ్‌మోర్‌ 10, సైఫ్‌ జైబ్‌ 13, పాల్‌ వాల్టర్‌ 15, క్రిస్‌ గ్రీన్‌ 3, డేవిడ్‌ పేన్‌ 0, జోష్‌ హల్‌ 3 (నాటౌట్‌), రిలే మెరిడిత్‌ 7 (నాటౌట్‌) పరుగులు చేశారు. 

సూపర్‌ ఛార్జర్స్‌ బౌలర్లలో ఇమాద్‌ వసీం, మాథ్యూ పాట్స్‌, ఆదిల్‌ రషీద్‌ తలో 2 వికెట్లు తీయగా.. మొహమ్మద్‌ ఆమిర్‌, టామ్‌ లాస్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం బరిలోకి దిగిన సూపర్‌ ఛార్జర్స్‌ మరో 11 బంతులు మిగిలుండగానే కేవలం​ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 144 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. జాక్‌ క్రాలే (38 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), హ్యారీ బ్రూక్‌ (15 బంతుల్లో 25 నాటౌట్‌; ఫోర్‌, 2 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడి సూపర్‌ ఛార్జర్స్‌ను విజయతీరాలకు చేర్చారు. డేవిడ్‌ మలాన్‌ (29 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడాడు. 

వెల్ష్‌ఫైర్‌ బౌలర్లలో రిలే మెరిడిత్‌కు 2 వికెట్లు దక్కాయి. కాగా, ఈ సీజన్‌కు ముందే కావ్యా మారన్‌ నేతృత్వంలోని సన్‌ గ్రూప్‌ నార్త్రన్‌ సూపర్‌ ఛార్జర్స్‌లోని మొత్తం వాటాను కొనుగోలు చేసింది. ఈ జట్టుతో పాటు హండ్రెడ్‌ లీగ్‌లోని మరో మూడు జట్లను ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)