Breaking News

రాణించిన ఆడమ్‌ జంపా.. ఘనంగా బోణీ కొట్టిన డిఫెండింగ్‌ ఛాంప్స్‌

Published on Wed, 07/24/2024 - 07:23

ద హండ్రెడ్‌ లీగ్‌ 2024 ఎడిషన్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఓవల్‌ ఇన్విన్సిబుల్స్‌ ఘనంగా బోణీ కొట్టింది. టోర్నీ ఓపెనింగ్‌ మ్యాచ్‌లో బర్మింగ్హమ్‌ ఫీనిక్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఫీనిక్స్‌.. 81 బంతుల్లో 89 పరుగులకే ఆలౌటైంది. ఆడమ్‌ జంపా (20-10-11-3) ఫీనిక్స్‌ పతనాన్ని శాశించగా.. మొహమ్మద్‌ ఆమిర్‌, సకీబ్‌ మహమూద్‌, విల్‌ జాక్స్‌ తలో రెండు వికెట్లు, నాథన్‌ సౌటర్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నారు. ఫీనిక్స్‌ ఇన్నింగ్స్‌లో రిషి పటేల్‌ (25), బెన్నీ హోవెల్‌ (24), బెతెల్‌ (22) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. 

స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇన్విన్సిబుల్స్‌ కేవలం 69 బంతుల్లోనే విజయతీరాలకు (2 వికెట్ల నష్టానికి) చేరింది. విల్‌ జాక్స్‌ 6, తువండ మెయేయే 23 పరుగులు చేసి ఔట్‌ కాగా.. డేవిడ్‌ మలాన్‌ (24), సామ్‌ బిల్లింగ్స్‌ (31) అజేయంగా నిలిచారు. ఫీనిక్స్‌ బౌలర్లలో టిమ్‌ సౌథీ రెండు వికెట్లు పడగొట్టాడు.

కాగా, ఫీనిక్స్‌, ఇన్విన్సిబుల్స్‌ జట్లు నిన్ననే ప్రారంభమైన మహిళల హండ్రెడ్‌ లీగ్‌లోనూ పోటీపడ్డాయి. ఈ మ్యాచ్‌లోనూ ఫీనిక్స్‌పై  ఇన్విన్సిబుల్స్‌ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇన్విన్సిబుల్స్‌ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ఫీనిక్స్‌ 92 బంతుల్లో 105 పరుగులు చేసి ఆలౌటైంది. తద్వారా ఇన్విన్సిబుల్స్‌ 45 పరుగుల తేడాతో గెలుపొందింది. 

ఇన్విన్సిబుల్స్‌ ఇన్నింగ్స్‌లో పేజ్‌ స్కోల్ఫీల్డ్‌ (71), అలైస్‌ క్యాప్సీ (52) అర్ద సెంచరీలతో రాణించగా.. ఫీనిక్స్‌ ఇన్నింగ్స్‌లో ఒక్కరు మాత్రమే 20 పరుగుల మార్కును దాటగలిగారు. ఇన్విన్సిబుల్స్‌ బౌలర్లలో అమండ 3, మ్యాడీ విల్లియర్స్‌ 2, మారిజన్‌ కాప్‌, సోఫీ స్మేల్‌, ర్యానా మెక్‌ డొనాల్డ్‌ గే తలో వికెట్‌ దక్కించుకున్నారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)