Breaking News

ఇంగ్లండ్‌ బౌలర్‌ విధ్వంసం.. 30 బంతుల్లోనే..!

Published on Mon, 08/14/2023 - 15:45

హండ్రెడ్‌ లీగ్‌-2023లో భాగంగా నార్త్రన్‌ సూపర్‌ ఛార్జర్స్‌తో నిన్న (ఆగస్ట్‌ 13) జరిగిన మ్యాచ్‌లో మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ బౌలర్‌, ఒరిజినల్స్‌ ఆల్‌రౌండర్‌ జేమీ ఓవర్టన్‌ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి తుఫాన్‌ ఇన్నింగ్స్‌ (30 బంతుల్లో 83; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆడి తన జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు.

అతనికి లారీ ఈవాన్స్‌ (18 బంతుల్లో 41; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ తోడవ్వడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఒరిజినల్స్‌ 90 బంతుల్లో (వర్షం అంతరాయం కారణంగా 90 బంతుల మ్యాచ్‌గా అంపైర్లు నిర్ణయించారు) 6 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఒరిజినల్స్‌ ఇన్నింగ్స్‌లో ఓవర్టన్‌, ఈవాన్స్‌తో పాటు పాల్‌ వాల్టర్‌ (22; 4 ఫోర్లు) ఓ మోస్తరు స్కోర్‌ చేయగా.. సూపర్‌ ఛార్జర్స్‌ బౌలర్లు రీస్‌ టాప్లే 3, బ్రైడన్‌ కార్స్‌, పార్కిన్సన్‌, ఆదిల్‌ రషీద్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సూపర్‌ ఛార్జర్స్‌ నిర్ణీత 90 బంతుల్లో 9 వికెట్ల నష్టానికి 141 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. ఒరిజినల్స్‌ బౌలర్లు ఉసామా మిర్‌ (4/19), జాషువ లిటిల్‌ (2/33) సూపర్‌ ఛార్జర్స్‌ను దారుణంగా దెబ్బకొట్టారు. వీరికి జోష్‌ టంగ్‌ (1/25), టామ్‌ హార్ట్‌లీ (1/9), పాల​్‌ వాల్డర్‌ (1/26) తోడవ్వడంతో సూపర్‌ఛార్జర్స్‌ ఇన్నింగ్స్‌ పేకమేడలా కూలింది.  సూపర్‌ ఛార్జర్స్‌ ఇన్నింగ్స్‌లో మాథ్యూ షార్ట్‌ (37), సైఫ్‌ జైబ్‌ (21), హ్యారీ బ్రూక్‌ (20) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు. 

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)