Breaking News

భారత్‌-బంగ్లా రెండో టెస్టు.. గ్రీన్‌ పార్క్‌ స్టేడియం వద్ద భారీ భద్రత

Published on Tue, 09/24/2024 - 15:19

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌పై టీమిండియా క‌న్నేసింది. సెప్టెంబ‌ర్ 27 నుంచి కాన్పూర్ వేదిక‌గా ప్రారంభం కానున్న రెండో టెస్టులో బంగ్లాతో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాను చిత్తు చేసిన టీమిండియా.. ఇప్పుడు రెండో టెస్టులో కూడా అదే జోరును కొన‌సాగించాల‌ని భావిస్తోంది. 

అయితే  గ్రీన్ పార్క్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌కు పోలీసులు భారీ భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలను నిరసిస్తూ  సోమ‌వారం గ్రీన్ పార్క్ స్టేడియం ముందు అఖిలేష్ భారతీయ హిందూ మహాసభ ఆధ్వ‌ర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

దీంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఎటువంటి అవాంఛ‌నీయ‌ సంఘ‌ట‌నలు జ‌ర‌గ‌కుండా మూడెంచెల భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. బంగ్లా జ‌ట్టు  బ‌స చేసే హోట‌ల్ వ‌ద్ద భద్రతను భారీగా పెంచిన‌ట్లు కాన్పూర్ అదనపు పోలీసు కమిషనర్ హరీష్ చందర్ తెలిపారు.

యూపీ పోలీస్‌, రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ అదనపు భద్రతను ఏర్పాటు ఆయ‌న వెల్ల‌డించారు. అదే విధంగా మ్యాచ్ జ‌రిగే స‌మ‌యంలో సీనియ‌ర్ ర్యాంక్ స్ధాయి ఆధికారులు కూడా బందోబస్తులో ఉంట‌రాని హరీష్ చందర్ స్ప‌ష్టం చేశారు. కాగా రెండో టెస్టు కోసం ఇరు జ‌ట్లు మంగ‌ళ‌వారం సాయంత్రం కాన్పూర్‌కు చేరుకోనున్నాయి.
చదవండి: IND vs BAN: అగార్కర్ కీలక నిర్ణ‌యం.. జ‌ట్టు నుంచి స్టార్‌ ప్లేయర్‌ అవుట్‌?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)