Breaking News

తమిళనాడు 674/6 డిక్లేర్డ్‌

Published on Sun, 10/20/2024 - 04:11

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో భాగంగా ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో తమిళనాడు భారీ స్కోరు చేసింది. గ్రూప్‌ ‘డి’లో భాగంగా జరిగిన పోరులో తమిళనాడు 674/6 వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. టీమిండియా ప్లేయర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ (269 బంతుల్లో 152; 19 ఫోర్లు, ఒక సిక్సర్‌) భారీ సెంచరీతో కదం తొక్కగా... ప్రదోష్‌ రంజన్‌ పాల్‌ (117; 13 ఫోర్లు) శతకం చేశాడు. 

అంతకుముందు ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ (213; 25 ఫోర్లు, ఒక సిక్సర్‌) కూడా ద్విశతకం నమోదు చేసుకోవడంతో తమిళనాడు భారీ స్కోరు చేయగలిగింది. నారాయన్‌ జగదీశన్‌ (65), సిద్ధార్థ్‌ (66 నాటౌట్‌) అర్ధసెంచరీలతో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో నవ్‌దీప్‌ సైనీ, హిమాన్షు చౌహాన్‌ చెరో రెండు వికెట్లు  పడగొట్టారు. ఓవర్‌నైట్‌ స్కోరు 379/1తో శనివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన తమిళనాడు జట్టు ఆడుతూ పాడుతూ పరుగులు రాబట్టింది. 

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఢిల్లీ... రెండో రోజు ఆట ముగిసే సమయానికి 16 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. సనత్‌ సాంగ్వాన్‌ (23 బ్యాటింగ్‌), హర్‌‡్ష త్యాగీ (15 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. చేతిలో 10 వికెట్లు ఉన్న ఢిల్లీ... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఇంకా 631 పరుగులు వెనుకబడి ఉంది.  

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)