Breaking News

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్‌.. స్టార్‌ బౌలర్‌ ఔట్‌

Published on Sun, 06/04/2023 - 17:57

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్‌ తగింది. గాయం కారణంగా ఆ జట్టు స్టార్‌ పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ప్రాక్టీస్‌ సెషన్‌ సందర్భంగా హాజిల్‌వుడ్‌ గాయం తిరగబెట్టిందని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) వెల్లడించింది. అతని స్థానంలో 33 ఏళ్ల రైట్‌ ఆర్మ్‌ పేసర్‌ మైఖేల్‌ నెసర్‌ను ఎంపిక చేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం నెసర్‌ ఇంగ్లండ్‌లోనే ఉన్నాడని, కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో అతను గ్లామోర్గన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడని తెలిపింది.

కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో నెసర్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడని, ఈ టోర్నీలో అతను 25.63 సగటున 19 వికెట్లు పడగొట్టాడని, దీన్ని పరిగణలోకి తీసుకునే అతన్ని ఎంపిక చేశామని సీఏ ప్రకటించింది. కాగా, హాజిల్‌వుడ్‌ ఇటీవల ముగిసిన ఐపీఎల్‌-2023 సందర్భంగా కూడా ఇలాగే గాయపడి లీగ్‌ మధ్యలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే.

 

ఇదిలా ఉంటే, భారత్‌-ఆస్ట్రేలియా మధ్య లండన్‌లోని కెన్నింగ్‌స్టన్‌ ఓవల్‌ మైదానం వేదికగా జూన్‌ 7 నుంచి 11 వరకు వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2021-23 ఫైనల్‌ జరుగనుంది. ప్రతిష్టాత్మకమైన ఈ మ్యాచ్‌ కోసం భారత్‌, ఆసీస్‌ జట్లు కఠోరంగా శ్రమిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి చరిత్ర సృష్టించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఇదివరకే ఐసీసీ టీ20, వన్డే టోర్నమెంట్‌లు (వరల్డ్‌కప్‌లు) గెలిచిన భారత్‌, ఆసీస్‌ జట్లు.. ఐసీసీ వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2021-23 గెలిచి, మూడు ఫార్మాట్లలో ఐసీసీ ట్రోఫీలు గెలిచిన జట్టుగా రికార్డుల్లోకెక్కాలని ఉవ్విళ్లూరుతున్నాయి.

అస్ట్రేలియా: మార్కస్‌ హ్యారిస్‌, ఉస్మాన్‌ ఖ్వాజా, డేవిడ్‌ వార్నర్‌, ట్రవిస్‌ హెడ్‌, స్టీవ్‌ స్మిత్‌, మార్నస్‌ లబూషేన్‌, కెమరూన్‌ గ్రీన్‌, అలెక్స్‌ క్యారీ, జోష్‌ ఇంగ్లిస్‌, పాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), స్కాట్‌ బోలాండ్‌, మైఖేల్‌ నెసర్‌, మిచెల్‌ స్టార్క్‌, టాడ్‌ మర్ఫీ, నాథన్‌ లయోన్‌

టీమిండియా: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, పుజారా, విరాట్‌ కోహ్లి, అజింక్య రహానే, అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, రవీంద్ర జడేజా, శ్రీకర్‌ భరత్‌, ఇషాన్‌ కిషన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, జయదేవ్‌ ఉనద్కత్‌


 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)