'భళా' బెల్జియం

Published on Fri, 07/03/2026 - 02:20

సీటెల్‌: బెల్జియం, సెనెగల్‌ మధ్య రౌండ్‌ ఆఫ్‌ 32 నాకౌట్‌ మ్యాచ్‌... ఎలా చూసినా ప్రత్యర్థికంటే బెల్జియం బలమైన జట్టు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్‌–10లో ఉండటంతో పాటు ‘ఫిపా’ ప్రపంచ కప్‌లో ఎంతో మెరుగైన రికార్డు ఉంది. ఈ మ్యాచ్‌లోనూ బెల్జియంనే అంతా ఫేవరెట్‌గా భావించారు. కానీ సెనెగల్‌ అసాధారణ ప్రదర్శనతో పెను సంచలనం నమోదయ్యేలా కనిపించింది. మ్యాచ్‌లో మరో 5 నిమిషాలు మిగిలి ఉండగా సెనెగల్‌ 2–0తో ముందంజలో ఉంది.

ఈ ఆఫ్రికా జట్టు ప్రిక్వార్టర్స్‌ చేరడం ఖాయమనిపించింది. అయితే బెల్జియం తమ స్థాయికి తగ్గ ఆటతో ఒక్కసారిగా కోలుకుంది. మూడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌ చేసి స్కోరును సమం చేయడంతో పాటు మ్యాచ్‌ను అదనపు సమయానికి మళ్లించగలిగింది. ఈ దశలో అనూహ్యంగా లభించిన పెనాల్టీని గోల్‌గా మలిచి ఊపిరి పీల్చుకుంది. చివరకు 3–2తో సెనెగల్‌ను ఓడించి తర్వాతి రౌండ్‌లోకి అడుగు పెట్టింది. 

ముందుగా సెనెగల్‌ తరఫున హబీబ్‌ దియారా (24వ నిమిషంలో), ఇస్మాయిలా సార్‌ (51వ ని.) గోల్స్‌ సాధించి జట్టును ఆధిక్యంలో నిలిపారు. ఆ తర్వాత బెల్జియం తరఫున ఆ జట్టు టాప్‌ ప్లేయర్‌ రొమెలు ల్యూకాకు (86వ నిమిషం), యూరీ టైల్‌మన్స్‌ (89వ ని.) గోల్స్‌ కొట్టడంతో స్కోరు సమమైంది. అదనపు సమయంలో సెనెగల్‌ ఆటగాడు లామిన్‌ కమారా ఫౌల్‌ చేయడంతో బెల్జియంకు పెనాల్టీ దక్కింది. దీనిపై సెనెగల్‌ ఆటగాళ్లు నిరసన వ్యక్తం చేసినా వీడియో రివ్యూ (వీఏఆర్‌) ద్వారా రిఫరీ పెనాల్టీని సరైందిగా తేల్చాడు. 

ఈ అవకాశాన్ని బెల్జియం వదులుకోలేదు. 120+5వ నిమిషంలో బంతిని యూరీ టైల్‌మన్స్‌ నెట్‌లోకి పంపించడంతో బెల్జియం సంబరాల్లో మునిగిపోయింది. 2 గోల్స్‌ కొట్టిన కెప్టెన్‌ టైల్‌మన్స్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.  2018 వరల్డ్‌ కప్‌లో కూడా బెల్జియం ఇదే తరహాలో జపాన్‌తో జరిగిన ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో 0–2తో వెనుకబడి కూడా ఆపై 3–2తో విజయాన్ని అందుకుంది.  

10 మందితో గెలిచిన యూఎస్‌...
శాన్‌ఫ్రాన్సిస్కో: ఆతిథ్య జట్టు యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా (యూఎస్‌ఏ) ప్రపంచ కప్‌లో ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగుపెట్టింది. టోర్నీ లీగ్‌ దశలో ఆడిన మూడు మ్యాచ్‌లలో కనీసం రెండేసి గోల్స్‌ కొట్టిన జట్టు నాకౌట్‌ పోరులోనూ అదే జోరును కొనసాగించింది. బోస్నియా అండ్‌ హెర్జిగోవినాతో జరిగిన పోరులో అమెరికా 2–0తో విజయం సాధించింది. యూఎస్‌ తరఫున ఫొలారిన్‌ బాలోగన్‌ (45వ నిమిషం), మలిక్‌ టిల్‌మాన్‌ (82వ ని.) ఒక్కో గోల్‌ నమోదు చేశారు. మ్యాచ్‌ ఆరంభం నుంచి బాలోగన్‌ దూకుడు ప్రదర్శిస్తూ ప్రత్యర్థి గోల్‌ పోస్ట్‌పై దూసుకుపోయాడు. 

31వ నిమిషంలో అతను మొదటి గోల్‌ కొట్టినా రిఫరీ దానిని ‘ఆఫ్‌సైడ్‌’గా గుర్తించి తిరస్కరించాడు. కొద్ది సేపటి తర్వాత బంతిని నిలువరించే ప్రయత్నంలో ప్రత్యర్థి ఆటగాడు ముహరెమొవిచ్‌ నియంత్రణ కోల్పోగా... దీనిని అవకాశంగా మలచుకున్న బాలోగన్‌ పదునైన కిక్‌తో తొలి గోల్‌గా మలిచాడు. అయితే బాలోగన్‌ను దురదృష్టం వెంటాడింది. ఆటలో దూసుకుపోతున్న తరుణంలో బంతిని తప్పిస్తుండగా అనూహ్యంగా అతని కాలు ముహరెమొవిచ్‌కు బలంగా తాకింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసినట్లుగా రిఫరీ భావించాడు. వీడియో రివ్యూలో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. దాంతో బాలోగన్‌కు రిఫరీ 64వ నిమిషంలోనే ‘రెడ్‌ కార్డ్‌’ చూపించాడు.

ఫలితంగా ఒక మ్యాచ్‌ నిషేధం కారణంగా బెల్జియంతో జరిగే ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌కు అతను దూరం కానున్నాడు. బాలోగన్‌ను తప్పించడంతో మిగిలిన 26 నిమిషాలు యూఎస్‌ పది మంది ఆటగాళ్లతోనే పోరాడింది. ఈ సమయంలో ఒక గోల్‌ నమోదు చేయడంతో పాటు పటిష్టమైన డిఫెన్స్‌తో బోస్నియాను నిలువరించడంలో సఫలమైంది. ప్రపంచ కప్‌ నాకౌట్‌ మ్యాచ్‌లో గోల్‌ చేసిన తర్వాత రెడ్‌కార్డుకు గురైన మూడో ఆటగాడిగా బాలోగన్‌ నిలిచాడు. 2002లో రొనాల్డిన్హో (బ్రెజిల్‌), 2006లో జినెదిన్‌ జిదాన్‌ (ఫ్రాన్స్‌) ఈ తరహాలో శిక్షకు గురయ్యారు. 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)