Breaking News

మిచెల్‌ ఓవెన్‌ సునామీ శతకం.. బిగ్‌బాష్‌ లీగ్‌ విజేత హోబర్ట్‌ హరికేన్స్‌

Published on Mon, 01/27/2025 - 17:09

బిగ్‌బాష్‌ లీగ్‌ 2024-25 ఎడిషన్‌లో హోబర్ట్‌ హరికేన్స్‌ విజేతగా నిలిచింది. ఇవాళ (జనవరి 27) జరిగిన ఫైనల్లో హరికేన్స్‌  సిడ్నీ థండర్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ధండర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఓపెనర్లు జేసన్‌ సంఘా (42 బంతుల్లో 67; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్‌ వార్నర్‌ (32 బంతుల్లో 48; 5 ఫోర్లు, సిక్స్‌) థండర్‌కు మెరుపు ఆరంభాన్ని అందించారు. అయితే థండర్‌ మధ్యలో తడబడింది. 

మాథ్యూ గిల్కెస్‌ డకౌట్‌ కాగా.. సామ్‌ బిల్లింగ్స్‌ (14 బంతుల్లో 20; ఫోర్‌, సిక్స్‌), ఒలివర్‌ డేవిస్‌ (19 బంతుల్లో 26; ఫోర్‌, సిక్స్‌), క్రిస్‌ గ్రీన్‌ (9 బంతుల్లో 16; 2 ఫోర్లు) పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. హరికేన్స్‌ బౌలర్లలో రిలే మెరిడిత్‌, కెప్టెన్‌ నాథన్‌ ఇల్లిస్‌ తలో మూడు వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్‌ చేసి థండర్‌ను భారీ స్కోర్‌ చేయకుండా అడ్డుకున్నారు.

అనంతరం లక్ష్య ఛేదనలో హరికేన్స్‌ ఓపెనర్‌ మిచెల్‌ ఓవెన్‌ విలయతాండవం చేశాడు. ఓవెన్‌ దెబ్బ​కు థండర్‌ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఓవెన్‌ విశ్వరూపం దాల్చి 16 బంతుల్లో హాఫ్‌ సెంచరీని, 39 బంతుల్లో సెంచరీని పూర్తి చేశాడు. ఓవెన్‌ సునామీ ఇన్నింగ్స్‌ దెబ్బకు హరికేన్స్‌ పవర్‌ ప్లేలో (తొలి 6 ఓవర్లలో) 98 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 42 బంతులు ఎదుర్కొన్న ఓవెన్‌ 6 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓవెన్‌ ఔటయ్యే సమయానికే హరికేన్స్‌ విజయం ఖరారయ్యింది. 

ఆఖర్లో మాథ్యూ వేడ్‌ (17 బంతుల్లో 32 నాటౌట్‌; 5 ఫోర్లు, సిక్స్‌), బెన్‌ మెక్‌డెర్మాట్‌ (12 బంతుల్లో 18 నాటౌట్‌; 2 ఫోర్లు) మ్యాచ్‌ను లాంఛనంగా పూర్తి చేశారు. హరికేన్స్‌ 14.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. హరికేన్స్‌ ఇన్నింగ్స్‌లో కాలెబ్‌ జువెల్‌ (13), నిఖిల్‌ చౌదరీ (1) మాత్రమే తక్కువ స్కోర్లకు ఔటయ్యారు.థండర్‌ బౌలర్లలో తన్వీర్‌ సంఘా 2, టామ్‌ ఆండ్రూస్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. 

హరికేన్స్‌ 14 ఏళ్ల సుదీర్ఘ ఎదురుచూపు తర్వాత సొంత ప్రేక్షకుల మధ్య టైటిల్‌ గెలిచింది. మిచెల్‌ ఓవెన్‌ సునామీ శతకంతో మ్యాచ్‌ను వన్‌ సైడెడ్‌గా చేశాడు. ఓవెన్‌కు ఈ సీజన్‌లో ఇది రెండో సెంచరీ. ఈ సెంచరీతో ఓవెన్‌ బీబీఎల్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డును (39 బంతుల్లో) కూడా సమం చేశాడు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)