Breaking News

బిగ్‌బాష్‌ లీగ్‌ ఫైనల్లో హరికేన్స్‌

Published on Wed, 01/22/2025 - 08:01

బిగ్‌బాష్‌ లీగ్‌ 2025 ఎడిషన్‌ ఫైనల్లోకి హోబర్ట్‌ హరికేన్స్‌ ప్రవేశించింది. నిన్న (జనవరి 21) జరిగిన క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో హరికేన్స్‌ సిడ్నీ సిక్సర్స్‌పై 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన హరికేన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. 

ఓపెనర్ మిచెల్‌ ఓవెన్‌ (15 బంతుల్లో 36; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), మిడిలార్డర్‌ బ్యాటర్‌ టిమ్‌ డేవిడ్‌ (10 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. కాలెబ్‌ జువెల్‌ (41 బంతుల్లో 40; 2 ఫోర్లు), బెన్‌ మెక​్‌డెర్మాట్‌ (31 బంతుల్లో 42; 4 ఫోర్లు, సిక్స్‌) రాణించారు. 

మథ్యూ వేడ్‌ 7 బంతుల్లో 4, నిఖిల్‌ చౌదరీ 11 బంతుల్లో 14, క్రిస్‌ జోర్డన్‌ 3 బంతుల్లో 2 (నాటౌట్‌), కెప్టెన్‌ నాథన్‌ ఇల్లిస్‌ 2 బంతుల్లో ఒక్క పరుగు చేశారు. సిక్సర్స్‌ బౌలర్లలో జాఫర్‌ చోహాన్‌, బెన్‌ డ్వార్షుయిస్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జాక్‌ ఎడ్వర్డ్స్‌, మిచెల్‌ పెర్రీ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన సిక్సర్స్‌ 20 ఓవర్లు పూర్తయ్యే సరికి 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు మాత్రమే చేయగలిగింది. 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన సిక్సర్స్‌ను కర్టిస్‌ ప్యాటర్సన్‌ (33 బంతుల్లో 48; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), జోర్డన్‌ సిల్క్‌ (44 బంతుల్లో 57; 5 ఫోర్లు), లాచ్లన్‌ షా (25 బంతుల్లో 33 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌) గట్టెక్కించే ప్రయత్నం​ చేశారు. 

అయితే హరికేన్స్‌ బౌలర్లు పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో వీరి ప్రయత్నం వృధా అయ్యింది. రిలే మెరిడిత్‌ 4 ఓవర్లలో 34 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టగా.. కెమరూన్‌ గానన్‌ 3 ఓవర్లలో 10 పరుగులకు 2 వికెట్లు తీశాడు. నాథన్‌ ఇల్లిస్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. సిక్సర్స్‌ బ్యాటర్లు జోష్‌ ఫిలిప్‌ (0), జాక్‌ ఎడ్వర్డ్‌ (0), కెప్టెన్‌ మోసస్‌ హెన్రిక్స్‌ (1) దారుణంగా విఫలమయ్యారు. 

పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండటంతో ఈ మ్యాచ్‌లో ఓడినా సిక్సర్స్‌కు మరో అవకాశం ఉంది. జనవరి 24న జరిగే ఛాలెంజర్‌లో నాకౌట్‌ విజేతతో తలపడుతుంది. ఇవాళ (జనవరి 22) జరుగబోయే నాకౌట్‌ మ్యాచ్‌లో సిడ్నీ థండర్‌, మెల్‌బోర్న్‌ స్టార్స్‌ అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ టోర్నీలో మెగా ఫైనల్‌ జనవరి 27న జరుగనుంది. ఛాలెంజర్‌ విజేతతో హరికేన్స్‌ ఫైనల్లో తలపడుతుంది. 
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)