Breaking News

World Archery Championships: భారత్‌కు గోల్డ్‌ మెడల్‌.. జ్యోతి జోడీకి రజతం

Published on Sun, 09/07/2025 - 17:05

ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌-2025లో భార‌త ఆర్చ‌ర్లు  స‌త్తాచాటారు. ఈ మెగా ఈవెంట్‌లో భార‌త్‌కు రెండు ప‌త‌కాలు ల‌భించాయి. రిషబ్ యాదవ్, అమన్ సైని, ప్రథమేష్ ఫుగేలతో కూడిన భార‌త పురుష‌ల జ‌ట్టు స్వ‌ర్ణ ప‌త‌కం కైవ‌సం చేసుకోగా.. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో రిష‌బ్‌- వెన్నం జ్యోతిసురేఖ జోడికి ర‌జ‌త ప‌త‌కం ద‌క్కింది.

ఆదివారం జ‌రిగిన ఫైనల్‌లో తొలుత భార‌త మెన్స్ టీమ్ ఫ్రాన్స్‌తో త‌ల‌ప‌డింది. హోరాహోరీగా సాగిన ఫైన‌ల్ పోరులో కేవ‌లం రెండు పాయింట్ల తేడాతో ఇండియా విజ‌యం సాధించింది. రిష‌బ్ అండ్ కో 235 పాయింట్లు సాధించ‌గా ఫ్రాన్స్ 233 పాయింట్లు సాధించింది. 

భార‌త పురుషుల జ‌ట్టు ఈ మెగా ఈవెంట్‌లో స్వ‌ర్ణం సాధించ‌డం ఇదే తొలిసారి. మ‌రోవైపు కాంపౌండ్ మిక్సిడ్ టీమ్ ఈవెంట్ ఫైన‌ల్లో  సురేఖ, రిషబ్ యాదవ్‌లతో కూడిన భారత జ‌ట్టు తృటిలో స్వ‌ర్ణాన్ని చేజార్చుకుంది. ఫైనల్ లో నెదర్లాండ్స్ జోడి చేతిలో 157-155 తేడాతో ఓటమి  పాల‌య్యారు. 

కేవలం రెండు పాయింట్ల తేడాతో ప‌స‌డి ప‌తకాన్ని భార‌త్ కోల్పోయింది.  ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక పతకాలు గెలిచిన భారత ఆర్చర్‌గా ఇప్పటికే రికార్డు సాధించిన జ్యోతి సురేఖకు ఇది తొమ్మిదో పతకం కావ‌డం విశేషం.
చదవండి: పాక్‌లో మ్యాచ్ జరుగుతుండగా ఉగ్రదాడి.. సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌పై నీలినీడ‌లు?

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)