Breaking News

చ‌రిత్ర సృష్టించిన టీమిండియా.. 147 ఏళ్లలో తొలిసారి!

Published on Sat, 10/19/2024 - 12:16

టెస్టు క్రికెట్‌లో టీమిండియా అరుదైన ఘ‌న‌త సాధించింది. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో టెస్ట్‌ ఫార్మాట్‌లో 100 సిక్స్‌లు బాదిన తొలి జట్టుగా భారత్‌ రికార్డుల‌కెక్కింది. బెంగ‌ళూరు వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో భార‌త్ ఈ అరుదైన రికార్డును త‌మ పేరిట లిఖించుకుంది. 

సెకెండ్ ఇన్నింగ్స్‌లో స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి బాదిన సిక్స‌ర్‌తో టీమిండియా 100 సిక్స్‌ల మైలురాయిని అందుకుంది. తద్వారా 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏ జ‌ట్టుకు సాధ్యం కాని రికార్డును టీమిండియా త‌మ ఖాతాలో వేసుకుంది. 

ఈ ఏడాది ఇప్పటి వరకు 17 టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ సేన‌.. 105 సిక్స్‌లు న‌మోదు చేసింది. ఈ జాబితాలో భార‌త్‌ తర్వాత ఇంగ్లండ్‌ (2022) 89 సిక్స్‌లతో రెండో స్థానంలో ఉండగా, 87 సిక్స్​లతో టీమిండియానే మూడో స్ధానంలో ఉంది. 

2021 ఏడాదిలో భార‌త్ టెస్టుల్లో 87 సిక్స్‌లు బాదింది. ప్ర‌స్తుత మ్యాచ్‌లో భార‌త్ ఇప్ప‌టివ‌ర‌కు 8 సిక్స్‌లు కొట్టింది. పంత్‌, స‌ర్ఫ‌రాజ్ త‌లా 3 సిక్స్‌లు బాద‌గా.. రోహిత్‌, విరాట్ చెరో సిక్స్ కొట్టారు. 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. నాలుగో రోజు  లంచ్‌ బ్రేక్‌ సమయానికి భారత్‌ తమ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. టీమిండియా ఇంకా 13 పరుగుల వెనకంజలో ఉంది. ప్రస్తుతం క్రీజులో సర్ఫరాజ్‌ ఖాన్‌(125), పంత్‌(53) పరుగులతో ఉన్నారు.
చదవండి: IND vs NZ: 'స‌ర్ఫ‌రాజ్ ఒక అద్బుతం.. ఆ దిగ్గ‌జాన్ని గుర్తు చేస్తున్నాడు'

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)