Breaking News

ఫైనల్లో హైయెస్ట్ రన్ ఛేజ్ ఎంతో తెలుసా?

Published on Sun, 11/02/2025 - 21:56

ఐసీసీ మహిళల ప్రపంచకప్‌-2025లో భాగంగా ముంబై వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో భారత బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

ఓపెనర్ షెఫాలీ వర్మ(78 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 87), దీప్తి శర్మ(58 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 58 ) రాణించ‌గా.. స్మృతి మంధాన(58 బంతుల్లో 45), రిచా ఘోష్(24 బంతుల్లో 34) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సౌతాఫ్రికా బౌల‌ర్ల‌లో ఖాకా మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ట్ర‌యాన్‌, డిక్లార్క్, మ‌బ్లా త‌లా వికెట్ సాధించారు. 

కాగా భార‌త్ మ‌హిళ‌ల ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్లో అత్య‌ధిక స్కోర్ చేసిన రెండో జ‌ట్టుగా భార‌త్ నిలిచింది. ఇంత‌కుముందు వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2022 ఫైన‌ల్లో ఇంగ్లండ్‌పై ఆసీస్ 356 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ 71 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.  ఈ నేప‌థ్యంలో ప్రపంచ కప్ ఫైనల్‌లో ఛేదించిన అత్యధిక ల‌క్ష్యాల‌పై ఓ లుక్కేద్దాం. 

మహిళల వ‌న్డే వ‌ర‌ల్డ‌క‌ప్‌ ఫైనల్‌లో ఛేజ్ చేసిన హైయెస్ట్ టోట‌ల్‌ 167గా ఉంది. 2009 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో నార్త్ సిడ్నీ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ ఈ ల‌క్ష్యాన్ని చేధించింది. మహిళల ప్రపంచ కప్ ఫైనల్స్‌లో కేవలం నాలుగు మాత్రమే విజయవంతమైన రన్-ఛేజింగ్‌లు జరిగాయి. ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన ప‌ది ఫైన‌ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జ‌ట్లే విజ‌యం సాధించాయి. మ‌రి ఇప్పుడు భార‌త్ అదే ఫ‌లితాన్ని పున‌రావృతం చేస్తుందో లేదా సౌతాఫ్రికా చరిత్రను తిరగరాస్తుందో వేచి చూడాలి.

మహిళల ప్రపంచ కప్ ఫైనల్స్‌లో అత్యధిక లక్ష్య చేధనలు ఇవే..

సంఖ్యపరుగుల ఛేదనజట్టుప్రత్యర్థిఫైనల్ సంవత్సరం
1167ఇంగ్లండ్ న్యూజిలాండ్2009
2165ఆస్ట్రేలియాన్యూజిలాండ్1997
3152ఆస్ట్రేలియా ఇంగ్లండ్ 1982
4128ఆస్ట్రేలియా ఇంగ్లండ్1988


 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)