Breaking News

జితేశ్‌ శర్మ సంచలనం.. ఐపీఎల్‌ చరిత్రలో పలు రికార్డులు బద్దలు

Published on Sat, 04/22/2023 - 22:38

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ మ్యాచ్‌లో పలు రికార్డులు బద్దలయ్యాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. సామ్‌ కరన్‌, హర్‌ప్రీత్‌ బాటియా, జితేశ్‌ శర్మలు కలిసి చేసిన విధ్వంసానికి రికార్డులు పగిలిపోయాయి. చివరి ఆరు ఓవర్లలో పంజాబ్‌ 109 పరుగులు చేసింది. దీనితో పాటు కొన్ని రికార్డులను పరిశీలిద్దాం.

►ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటర్‌ జితేశ్‌ శర్మ సంచలనం సృష్టించాడు. ఏడు బంతు​ల్లోనే 25 పరుగులు చేసిన జితేశ్‌ శర్మ పంజాబ్‌ కింగ్స్‌ తరపున ఐపీఎల్‌లో అత్యధిక స్ట్రైక్‌రేట్‌ నమోదు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. జితేశ్‌ 357.14 స్ట్రైక్‌రేట్‌తో తొలి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో బానుక రాజపక్స(9 బంతుల్లో 31 పరుగులు, 344.44 స్ట్రైక్‌రేట్‌), కేఎల్‌ రాహుల్‌(16 బంతుల్లో 51 పరుగులు, 318.75 స్ట్రైక్‌రేట్‌), నికోలస్‌ పూరన్‌ (8 బంతుల్లో 25*పరుగుఉల, 312.50 స్ట్రైక్‌రేట్‌) ఉన్నారు.

►ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో చివరి ఆరు ఓవర్లలో పంజాబ్‌ కింగ్స్‌  109 పరుగులు చేసింది. ఐపీఎల్‌ చరిత్రలో చివరి ఆరు ఓవర్లలో ఇన్ని పరుగులు చేయడం పంజాబ్‌కు ఇదే తొలిసారి. ఓవరాల్‌గా పంజాబ్‌ రెండో స్థానంలో ఉండగా.. తొలి స్థానంలో ఆర్‌సీబీ గుజరాత్‌ లయన్స్‌పై చివరి ఆరు ఓవర్లలో 126 పరుగులు చేసి తొలి స్థానంలో ఉండగా.. 2020లో పంజాబ్‌ కింగ్స్‌పై ముంబై 104 పరుగులు చేసింది.

►ఇక ముంబై ఇండియన్స్‌ తరపున ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న రెండో బౌలర్‌గా అర్జున్‌ టెండూల్కర్‌ నిలిచాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో అర్జున్‌ ఒక ఓవర్లో 31 పరుగులిచ్చుకున్నాడు. తొలి స్థానంలో డేనియల్‌ సామ్స్‌ (35 పరుగులు వర్సెస్‌ కేకేఆర్‌) ఉన్నాడు. 

►ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో సామ్‌ కరన్‌-హర్‌ప్రీత్‌ బాటియాలు ఐదో వికెట్‌కు 92 పరుగులు జోడించారు. పంజాబ్‌ కింగ్స్‌ తరపున ఐదో వికెట్‌కు ఇది రెండో అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. తొలి స్థానంలో డేవిడ్‌ మిల్లర్‌-రాజ్‌గోపాల్‌ సతీష్‌(130*పరుగులు) తొలి స్థానంలో ఉన్నారు.

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)