Breaking News

చరిత్ర సృష్టించిన బాబర్ ఆజం.. తొలి కెప్టెన్‌గా! కోహ్లి రికార్డు బద్దలు

Published on Thu, 08/31/2023 - 07:56

పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం మరోసారి తన సత్తాను ప్రపంచానికి చూపించాడు. ఆసియా కప్ 2023లో భాగంగా నేపాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బాబర్‌ ఆజం విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 131 బంతులు ఎదుర్కొన్న బాబర్‌.. 14 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 151 పరుగులు చేశాడు. 

బాబర్‌కు ఇది తన కెరీర్‌లో 19వ వన్డే సెంచరీ. ఈ మ్యాచ్‌లో అద్బుత ఇన్నింగ్స్‌ ఆడిన బాబర్‌ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో నేపాల్‌పై 238 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ భారీ విజయం సాధించింది. పాకిస్తాన్‌ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్‌ 2న భారత్‌తో తలపడనుంది.

బాబర్‌ సాధించిన రికార్డులు ఇవే..
వన్డేల్లో అత్యంత వేగంగా 19 సెంచరీలు చేసిన ఆటగాడిగా బాబర్‌ రికార్డులకెక్కాడు. బాబర్‌ ఈ ఫీట్‌ను కేవలం 102 ఇన్నింగ్స్‌లు మాత్రమే అందుకున్నాడు. అంతకముందు ఈ రికార్డు  సౌతాఫ్రికా లెజెండ్‌ హషీమ్‌ ఆమ్లా (104 ఇన్నింగ్స్‌ల్లో) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో ఆమ్లా రికార్డును ఆజం బ్రేక్‌ చేశాడు.

అదే విధంగా ఆసియాకప్‌ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన కెప్టెన్‌గా బాబర్‌ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్‌, స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి(136) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌లో 151 పరుగులు చేసిన ఆజం.. కింగ్‌ రికార్డును బద్దలు కొట్టాడు.

అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌(5238), ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ మార్టిన్‌(5346)ను బాబర్‌ అధిగమించాడు. ఇప్పటివరకు 102 ఇన్నింగ్స్‌లలో ఆజం 5353 పరుగులు చేశాడు.
చదవండి: AUS vs SA 1st T20I: మిచెల్‌ మార్ష్‌ ఊచకోత.. డేవిడ్‌ విధ్వంసం! దక్షిణాఫ్రికా చిత్తు

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)