Breaking News

అక్కడా.. ఇక్కడా ఆర్సీబీ ఆటగాళ్లదే డామినేషన్‌..!

Published on Sun, 03/17/2024 - 15:54

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో (ఐపీఎల్‌) రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ జట్టు ఇప్పటివరకు ఒక్క ఐపీఎల్‌ టైటిల్‌ గెలవకపోయినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులంతా ఈ జట్టునే అధికంగా ఇష్టపడతారు. 

ఆర్సీబీ ప్రాతినిథ్యం వహించిన, వహిస్తున్న క్రిస్‌ గేల్‌, ఏబీ డివిలియర్స్‌, విరాట్‌ కోహ్లి, ఫాఫ్‌ డుప్లెసిస్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ లాంటి ఆటగాళ్ల రేంజ్‌ వేరే లెవెల్‌ అని చెప్పాలి. ఆర్సీబీ క్రేజ్‌ కేవలం ఐపీఎల్‌కు మాత్రమే పరిమితం కాలేదు.

ఈ జట్టు ఆటగాళ్ల క్రేజ్‌ మహిళల ఐపీఎల్‌లోనూ (డబ్ల్యూపీఎల్‌) ఇదే రేంజ్‌లో ఉంది. డబ్ల్యూపీఎల్‌లోనూ ఆర్సీబీ టైటిల్‌ సాధించకపోయినా విశ్వవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. తాజా డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ ఫైనల్‌కు చేరి తమ తొలి టైటిల్‌పై అభిమానుల్లో ఆశలు రేకెత్తిస్తుంది. నేడు జరుగబోయే ఫైనల్లో స్మృతి మంధన నేతృత్వంలోని ఆర్సీబీ.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. 

డబ్ల్యూపీఎల్‌ 2024 ఫైనల్‌ నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ఆర్సీబీ కేవలం క్రేజ్‌ విషయంలోనే తోపు కాదని గణంకాలు సూచిస్తున్నాయి. ఐపీఎల్‌, డబ్ల్యూపీల్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో అత్యుత్తమ గణాంకాలు ఆర్సీబీ ఆటగాళ్ల పేరిటే ఉన్నాయి. ఐపీఎల్‌లో అత్యధిక​ వ్యక్తిగత స్కోర్‌ రికార్డు (175) క్రిస్‌ గేల్‌ పేరిట ఉండగా.. మహిళల ఐపీఎల్‌లో ఈ రికార్డు ఆర్సీబీకే చెందిన సోఫీ డివైన్‌ (99) పేరిట ఉంది.

బౌలింగ్‌ విషయానికొస్తే.. ఐపీఎల్‌లో అత్యుత్తమ వ్యక్తిగత బౌలింగ్‌ గణాంకాలు (6/12) ఆర్సీబీ బౌలర్‌ అల్జరీ జోసఫ్‌ పేరిట ఉండగా.. డబ్ల్యూపీఎల్‌లో అత్యుత్తమ వ్యక్తిగత బౌలింగ్‌ గణాంకాలు (6/15) ఎల్లిస్‌ పెర్రీ పేరిట ఉన్నాయి. ఈ గణాంకాలు చూస్తే ఐపీఎల్‌, డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ డామినేషన్‌ ఏ రేంజ్‌లో సాగుతుందో ఇట్టే అర్దమవుతుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)