Breaking News

టీమిండియాతో వన్డే సిరీస్‌.. విండీస్‌ జట్టు ప్రకటన! విధ్వంసకర ఆటగాడు వచ్చేశాడు

Published on Tue, 07/25/2023 - 07:39

స్వదేశంలో టీమిండియాతో జరగనున్న వన్డే సిరీస్‌ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును విండీస్‌ క్రికెట్‌ ప్రకటించింది. ఈ సిరీస్‌కు ఆ జట్టు స్టార్‌ బ్యాటర్‌ నికోలస్‌ పూరన్‌, ఆల్‌రౌండర్‌ జాసన్‌ హోల్డర్‌ దూరమయ్యారు. పూరన్‌ అమెరికా వేదికగా జరగుతున్న మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నీలో బీజీగా ఉండడతో ఈ వన్డే సిరీస్‌కు అందుబాటులో లేడు. మరోవైపు హోల్డర్‌కు విండీస్‌ సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ సిరీస్‌తో విండీస్‌ విధ్వంసకర ఆటగాడు షిమ్రాన్‌ హెట్‌మైర్‌ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. విండీస్‌ క్రికెట్‌ బోర్డ్‌తో విభేదాల కారణంగా గత కొంత కాలంగా జాతీయ జట్టుకు హెట్‌మైర్‌ దూరంగా ఉన్నాడు.

అతడు చివరగా 2022లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కరేబియన్‌ జట్టు తరపున కనిపించాడు. అదే విధంగా వన్డేల్లో అయితే 2021లో ఆస్ట్రేలియాపై ఆడాడు. ఇక అతడితో పాటు పేసర్‌ ఒషానే థామస్‌కు ఛానాళ్ల తర్వాత విండీస్‌ జట్టులో చోటు దక్కింది. అదే విధంగా గాయం కారణంగా వన్డే ప్రపంచకప్‌కు దూరమైన లెగ్‌ స్పిన్నర్‌ గుడ్‌కేష్‌ మోటి కూడా ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు. ఇక జూలై 27న బార్బడోస్‌ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్‌ మొదలు కానుంది.

టెస్టు సిరీస్‌ టీమిండియాదే..
ఇక రెండో టెస్టులో విండీస్‌ను ఓడించి.. సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేద్దామన్న టీమిండియా కలనేరవేరలేదు. వర్షం కారణంగా రెండో టెస్టు ఐదో రోజు ఒక్క బంతి కూడా వేయకుండా ఆట రద్దయ్యింది. తొలి టెస్టు గెలిచిన భారత్‌ సిరీస్‌ను 1–0తో సొంతం చేసుకుంది. 

భారత్‌తో వన్డేలకు వెస్టిండీస్ జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్ (వైస్ కెప్టెన్), అలిక్ అథానాజ్, యానిక్ కారియా, కీసీ కార్టీ, డొమినిక్ డ్రేక్స్, షిమ్రాన్ హెట్మెయర్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోటీ, జైడెన్ సిన్సీల్స్, రొమారియోక్ల్ సీల్స్.
చదవండి: Ind Vs WI 2nd Test Day 5: వదలని వాన... రెండో టెస్టు డ్రా! సిరీస్‌ భారత్‌దే

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)