Breaking News

న్యూజిలాండ్‌కు 'ట్రిపుల్‌' షాక్‌

Published on Mon, 12/08/2025 - 16:42

స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో న్యూజిలాండ్‌కు ట్రిపుల్‌ షాక్‌ తగిలింది. డిసెంబర్‌ 10 నుంచి వెల్లింగ్టన్‌ వేదికగా జరుగబోయే రెండో టెస్ట్‌కు ముందు ఏకంగా ముగ్గురు స్టార్‌ బౌలర్లు గాయపడ్డారు. 

మ్యాట్‌ హెన్రీ కాఫ్‌ ఇంజ్యూరితో, నాథన్‌ స్మిత్‌ సైడ్‌ స్ట్రెయిన్‌తో, మిచెల్‌ సాంట్నర్‌ గ్రోయిన్‌ ఇంజ్యూరితో మిగతా రెండు టెస్ట్‌లకు దూరమయ్యారు. వీరి స్థానాల్లో ఆల్‌రౌండర్‌ క్రిస్టియన్‌ క్లార్క్‌, ఫాస్ట్‌ బౌలర్‌ మైఖేల్‌ రే, గ్లెన్‌ ఫిలిప్‌ జట్టులోకి వచ్చారు. 

స్మిత్‌, హెన్రీ తొలి టెస్ట్‌ సందర్భంగా గాయపడగా.. సాంట్నర్‌ ఇదే గాయం కారణంగా తొలి టెస్ట్‌కు కూడా దూరంగా ఉన్నాడు.  పై ముగ్గురితో పాటు కొత్తగా మరో ఎంపిక కూడా జరిగింది. తొలి టెస్ట్‌ సందర్భంగా గాయపడిన టామ్‌ బ్లండెల్‌కు కవర్‌గా మిచ్‌ హేను కూడా జట్టులోకి తీసుకున్నారు.

కాగా, క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌ రసవత్తరంగా సాగింది. విండీస్‌ బ్యాటర్లు అసమాన పోరాటపటిమతో 531 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ మ్యాచ్‌ను డ్రా చేసుకున్నారు.

షాయ్‌ హోప్‌ సూపర్‌ సెంచరీ (140).. జస్టిన్‌ గ్రీవ్స్‌ అజేయ డబుల్‌ సెంచరీ (202).. కీమర్‌ రోచ్‌ (233 బంతుల్లో 58 నాటౌట్‌) అద్భుత ఇన్నింగ్స్‌తో విండీస్‌ను గెలుపు వాకిటి వరకు తీసుకెళ్లారు.

72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశ నుంచి గెలుపు అంచులకు వెళ్లిందంటే, ఈ విండీస్‌ యోధుల పోరాటం ఎలా సాగిందో అర్దం చేసుకోవచ్చు. అంత భారీ లక్ష్య ఛేదనలో విండీస్‌ ఆటగాళ్లు ఒత్తిడికి లోనుకాకుండా ఏకంగా 163.3 ఓవర్లు ఎదుర్కోవడం అంటే సామాన్యమైన విషయం కాదు.

చేతిలో 4 వికెట్లు ఉండి, గెలుపుకు 74 పరుగుల దూరంలో ఉన్న సమయంలో (457/6), ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఈ మ్యాచ్‌ డ్రాగా ప్రకటించారు.  ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసినా పరోక్షంగా విండీస్‌ గెలిచినట్లే. విండీస్‌ యెధుల పోరాటాన్ని యావత్‌ క్రికెట్‌ ప్రపంచం​ కీర్తించింది.


 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)