320 మ్యాచ్‌లు.. 8000 రన్స్‌! రిటైర్మెంట్‌ ప్రకటించిన ఇంగ్లండ్‌ లెజెండ్‌

Published on Sun, 07/12/2026 - 11:28

ఇంగ్లండ్ మ‌హిళ‌ల జ‌ట్టు మాజీ కెప్టెన్ హీథ‌ర్ నైట్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. లార్డ్స్ వేదిక‌గా భార‌త మ‌హిళ‌ల‌తో జ‌రుగుతున్న ఏకైక టెస్ట్ అనంత‌రం అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోనున్నట్లు నైట్ ప్రకటించింది. నైట్‌తో పాటు ఆమె సహచర ప్లేయర్‌ టామీ బ్యూమౌంట్ కూడా ఈ టెస్ట్ మ్యాచ్ ముగిశాక అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నారు.

కాగా 35 ఏళ్ల హీథ‌ర్ నైట్.. ఇంగ్లండ్ మహిళ‌ల క్రికెట్ చ‌రిత్ర‌లో త‌న పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. ప్లేయ‌ర్‌గా, కెప్టెన్‌గా దాదాపు 16 ఏళ్ల పాటు ఇంగ్లండ్ క్రికెట్‌కు త‌న సేవ‌ల‌ను అందించింది. 2010లో ఇంగ్లండ్ త‌రపున అరంగేట్రం చేసిన‌ నైట్, ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 320 మ్యాచ్‌లు ఆడింది. 2016లో షార్లెట్ ఎడ్వర్డ్స్ నుంచి కెప్టెన్సీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన నైట్‌.. ఇంగ్లండ్ క్రికెట్‌ను మ‌రో స్ధాయికి తీసుకెళ్లింది.

2016 నుండి 2025 వరకు ఇంగ్లండ్‌ జట్టుకు 199 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన నైట్‌.. అందులో 134 విజయాలను అందించింది. అంతేకాకుండా ఆమె సార‌థ్యంలోనే 2017 మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను ఇంగ్లండ్ సొంతం చేసుకుంది. అయితే 2024/25 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ ఘోర ఓట‌మి త‌ర్వాత ఆమె కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి వైదొలిగింది. 

కానీ ప్లేయ‌ర్‌గా మాత్రం కొన‌సాగుతూ వ‌చ్చింది. కానీ హీథ‌ర్‌ ఇప్పుడు స‌డ‌న్‌గా రిటైర్మెంట్ ప్ర‌క‌టించి అంద‌రికి షాకిచ్చింది. అంతర్జాతీయ క్రికెట్‌లో 6 సెంచరీలతో స‌హా దాదాపు 8,000 పరుగులు నైట్ సాధించింది. నైట్‌ ఇంగ్లండ్‌ తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా కొనసాగుతోంది.
చదవండి: ENG vs ZIM: టీమిండియాకు డబుల్ షాక్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)