విండీస్‌తో వన్డే సిరీస్‌ నుంచి ఇంగ్లండ్‌ తాజా మాజీ కెప్టెన్‌ ఔట్‌.. భారత్‌తో సిరీస్‌కు కూడా..!

Published on Thu, 05/29/2025 - 18:48

ఇంగ్లండ్‌ మహిళల క్రికెట్‌ జట్టు తాజా మాజీ కెప్టెన్‌ హీథర్‌ నైట్‌ త్వరలో వెస్టిండీస్‌తో జరుగనున్న వన్డే సిరీస్‌ నుంచి నిష్క్రమించింది. గాయం కారణంగా నైట్‌ ఈ సిరీస్‌తో పాటు జూన్‌, జులైల్లో షెడ్యూలైన భారత పర్యటనకు కూడా దూరమైంది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న నైట్‌ పై రెండు సిరీస్‌లతో పాటు హండ్రెడ్‌ లీగ్‌ నుంచి కూడా తప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

నైట్‌ గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మూడు నెలల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే నైట్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో ఆడేది కూడా అనుమానంగా కనిపిస్తుంది. 

నైట్‌ గైర్హాజరీలో విండీస్‌తో సిరీస్‌లో నాట్‌ సీవర్‌ బ్రంట్‌ ఇంగ్లండ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఈ సిరీస్‌లో నైట్‌ స్థానాన్ని అలైస్‌ క్యాప్సీ భర్తీ చేయనుంది. నైట్‌ మే 26న విండీస్‌తో జరిగిన మూడో టీ20 సందర్భంగా గాయపడింది. ఈ మ్యాచ్‌లో 66 పరుగుల వద్ద ఉన్న సమయంలో నైట్‌ అర్దంతరంగా మైదానాన్ని వీడింది.

కాగా, మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం వెస్టిండీస్‌ మహిళల క్రికెట్‌ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో టీ20 సిరీస్‌ ఇదివరకే ముగియగా.. వన్డే సిరీస్‌ మే 30 నుంచి ప్రారంభం‍ కానుంది. టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేసిన ఇంగ్లండ్‌.. వన్డే సిరీస్‌ను కూడా అదే తరహాలో ముగించాలని భావిస్తుంది. మే 30, జూన్‌ 4, 7 తేదీల్లో మూడు వన్డేలు వేర్వేరు వేదికల్లో జరుగనున్నాయి.

విండీస్‌తో వన్డే సిరీస్‌కు ఇంగ్లండ్‌ జట్టు..
నాట్‌ సీవర్‌ బ్రంట్‌ (కెప్టెన్‌), అలైస్‌ డేవిడ్‌సన్‌ రిచర్డ్స్‌, మహిక గౌర్‌, సోఫీ డంక్లీ, ట్యామీ బేమౌంట్‌, అలైస్‌ క్యాప్సీ, ఆమీ జోన్స్‌, ఎమ్మా లాంబ్‌, ఎమ్‌ ఆర్లాట్‌, సారా గ్లెన్‌, కేట్‌ క్రాస్‌, లిన్సే స్మిత్‌, లారెన్‌ బెల్‌, చార్లెట్‌ డీన్‌

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)