Breaking News

బట్లర్‌కు ఇదేమి కొత్త కాదు.. 

Published on Tue, 01/31/2023 - 08:56

ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జాస్‌‌ బట్లర్‌ చర్య సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌ సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ప్రొటిస్‌ 2-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా కెప్టెన్‌ బవుమా సూపర్‌ సెంచరీతో జట్టుకు విజయం అందించి సిరీస్‌ను గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 

ఈ విషయం పక్కనబెడితే.. సౌతాఫ్రికా బ్యాటర్‌ వాండర్‌ డసెన్‌ను బట్లర్‌ తన వెకిలి చేష్టలతో చిరాకు తెప్పించాడు దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇన్నింగ్స్‌ 19వ ఓవర్లో బట్లర్‌.. ''నీ సమస్యేంటి రాసీ.. ప్రతీసారి నీ గురించి రావడం లేదు.. బంతిని అందుకోవడానికి ప్రయత్నిస్తున్నా.. నిన్ను కాదు'' అంటూ పేర్కొన్నాడు. దానికి డసెన్‌.. ''ఏం జరిగిందో నేను చూశాను'' అంటూ ధీటుగా బదులిచ్చాడు. ఆ తర్వాత ఇద్దరు వాగ్వాదానికి దిగడం స్టంప్‌మైక్‌లో రికార్డయింది. ఇదంతా గమనించిన అంపైర్‌  ఇక చాలు ఆపండి అనగానే ఇద్దరు సైలెంట్‌ అయిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే ఇలాంటివి బట్లర్‌కు కొత్తేమి కాదు. ఇంతకముందు కూడా తన కవ్వింపు చర్యలతో బ్యాటర్‌ను ఇబ్బంది పెట్టాడు. 2020లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ మధ్య టెస్టు మ్యాచ్‌ జరిగింది. ఆ మ్యాచ్‌లో క్రీజులో ఉన్న ఫిలాండర్‌తో బట్లర్‌ మాటల యుద్ధానికి దిగాడు. ఫీల్డర్‌ బంతిని అందుకొని ఫిలాండర్‌ వైపు విసిరాడు. ఈ క్రమంలో బంతిని అందుకున్న బట్లర్‌.. ఫిలాండర్‌ను చూస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో ఈ వీడియో బాగా పాపులర్‌ అయింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. జాస్‌ బట్లర్‌ 94 నాటౌట్‌, హ్యారీ బ్రూక్‌ 80, మొయిన్‌ అలీ 51 పరుగులు చేశారు.  అనంతరం బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రాకా 49.1 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. టెంబా బవుమా 109 పరుగులు చేయగా.. డేవిడ్‌ మిల్లర్‌ 58 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

చదవండి: ILT20 2023: తిరిగిస్తాడనుకుంటే పారిపోయాడు

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)