Breaking News

గిల్‌ స్థానంలో అతడిని ఆడించండి.. ఓపెనర్‌గా కేఎల్‌ బెస్ట్‌: భారత మాజీ క్రికెటర్‌

Published on Wed, 11/20/2024 - 14:47

క్రికెట్‌ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమైంది. టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ శుక్రవారం మొదలుకానుంది. ఇందుకోసం ఇప్పటికే కంగారూ దేశానికి చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్‌లో తలమునకలైంది.

అయితే, ఈ ఐదు మ్యాచ్‌ల కీలక టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా ప్రధాన ఆటగాళ్ల గాయపడటం మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. గాయాల వల్ల శుబ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌ తొలి టెస్టుకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండగా.. గిల్‌ కూడా అందుబాటులో ఉండకపోవచ్చని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి.

శుబ్‌మన్‌ గిల్‌ స్థానంలో..
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శుబ్‌మన్‌ గిల్‌ స్థానంలో దేవ్‌దత్‌ పడిక్కల్‌ను జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. అంతేకాదు తుదిజట్టులోనూ అతడిని ఆడించాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. అదే విధంగా.. యశస్వి జైస్వాల్‌కు జోడీగా కేఎల్‌ రాహుల్‌ను పంపితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.

కేరళకు చెందిన దేవ్‌దత్‌ పడిక్కల్‌ ఈ ఏడాది మార్చిలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ధర్మశాల వేదికగా జరిగిన ఐదో టెస్టులో.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన పడిక్కల్‌.. 103 బంతులు ఎదుర్కొని 65 పరుగులు సాధించాడు. అయితే, ఆ తర్వాత ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌కు మళ్లీ జట్టులో స్థానం దక్కలేదు.

ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లోనూ
అయితే, ఇటీవల ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుతో జరిగిన రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌లో దేవ్‌దత్‌ పడిక్కల్‌ భారత్‌-‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగాడు. నాలుగు ఇన్నింగ్స్‌లో వరుసగా 36, 88, 26, 1 పరుగులు చేశాడు. ఇక ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లోనూ 24 ఏళ్ల పడిక్కల్‌కు మంచి రికార్డే ఉంది.

ఎడమచేతి వాటం బ్యాటర్‌ కూడా!
ఇప్పటి వరకు 40 మ్యాచ్‌లలో కలిపి 2677 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు సెంచరీలు, 17 అర్ధ శతకాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పడిక్కల్‌ గురించి వసీం జాఫర్‌ ప్రస్తావిస్తూ... ‘‘టీమిండియా తరఫున అతడు ఇంతకుముందు టెస్టు క్రికెట్‌ ఆడాడు. పరుగులు కూడా రాబట్టాడు.

అంతేకాదు.. అతడు ఎడమచేతి వాటం బ్యాటర్‌ కూడా! కాబట్టి ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో మూడో స్థానంలో పడిక్కల్‌ను ఆడిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా.. ధ్రువ్‌ జురెల్‌ను కూడా మిడిలార్డర్‌లో ఆడించాలని వసీం జాఫర్‌ అభిప్రాయపడ్డాడు. పెర్త్‌ టెస్టులో జైస్వాల్‌కు తోడుగా కేఎల్‌ రాహుల్‌ను ఓపెనర్‌గా పంపాలని ఈ సందర్భంగా ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో పేర్కొన్నాడు.

ఓపెనర్‌గా రాహుల్‌ బెస్ట్‌
కాగా టీమిండియా తరఫున ఓపెనర్‌గా ఇప్పటి వరకు 49 టెస్టులు ఆడిన కేఎల్‌ రాహుల్‌ ఖాతాలో 2551 పరుగులు ఉన్నాయి. ఇందులో ఏడు శతకాలు, 12 హాఫ్‌ సెంచరీలు. ఇక ఓవరాల్‌గా కేఎల్‌ రాహుల్‌ 53 టెస్టుల్లో 2981 రన్స్‌ సాధించాడు. మరోవైపు.. ధ్రువ్‌ జురెల్‌ ఇటీవల ఆసీస్‌-‘ఎ’తో అనధికారిక టెస్టుల్లో 93, 80, 68 రన్స్‌ చేశాడు. ఇక టీమిండియా తరఫున నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి జురెల్‌ 190 పరుగులు సాధించాడు.

చదవండి: Hardik Pandya: అన్న సారథ్యంలో తమ్ముడు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)