Breaking News

మరోసారి HCA వివాదం.. బీసీసీఐకి ఫిర్యాదు

Published on Fri, 09/19/2025 - 14:09

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (HCA)లో మరోసారి వివాదం చెలరేగింది. హెచ్‌సీఏ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న దల్జిత్ సింగ్‌పై పలువురు క్లబ్‌ సెక్రటరీలు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI)కి ఫిర్యాదు చేశారు. కాగా ఈ నెల 28న ముంబై లో బీసీసిఐ 95వ వార్షిక సభ్య సమావేశం (AGM) జరుగనుంది.

ఈ నేపథ్యంలో ఏజీఎంలో పాల్గొనేందుకు బీసీసీఐ... అన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్‌లకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా హెచ్‌సీఏకు కూడా ఆహ్వానం అందింది. ఈ క్రమంలో HCA యాక్టింగ్ ప్రెసిడెంట్‌గా దల్జిత్ ఉండటం నిబంధనలకు విరుద్ధం అంటూ పలువురు క్లబ్ సెక్రటరీలు బీసీసీఐకి లేఖలు రాశారు. అదే విధంగా.. దల్జిత్‌పై సింగిల్ మెoబర్ కమిటీ జస్టిస్ నవీన్ రావ్‌కు కూడా వీరు ఫిర్యాదు చేశారు.

కాగా తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీఐడీ హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌ రావును జూలై నెలలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతడితో  పాటు కోశాధికారి శ్రీనివాస్ రావు, సీఈఓ సునీల్ కంటే, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవితలను కూడా సీఐడీ అరెస్టు చేసింది.

ఈ క్రమంలో జగన్మోహన్‌ రావు అక్రమ పద్ధతిలో హెచ్‌సీఏలోకి ప్రవేశించినట్లు సీఐడీ గుర్తించింది. ఈ పరిణామాల నేపథ్యంలో అధ్యక్షుడిగా జగన్మోహన్‌ రావును తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అతడి స్థానంలో దల్జిత్ సింగ్‌ తాత్కాలిక అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)