పదవి నుంచి తప్పుకున్న ఆఫ్ఘనిస్తాన్‌ కెప్టెన్‌

Published on Wed, 07/22/2026 - 10:47

ఆఫ్ఘనిస్తాన్‌ వన్డే జట్టు కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ తన పదవికి రాజీనామా చేశాడు. వ్యక్తిగత కారణాల వల్ల అతడు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెట్ బోర్డు (ACB) అధికారికంగా ప్రకటించింది. అయితే షాహిదీ ఆటగాడిగా మాత్రం వన్డే జట్టుకు అందుబాటులో ఉండనున్నాడు.

2021లో వన్డే జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టిన షాహిదీ ఆఫ్ఘనిస్తాన్‌కు ఎన్నో మరుపురాని విజయాలనందించాడు. అతడి నాయకత్వంలో ఆ జట్టు అంతర్జాతీయ క్రికెట్‌లో విశేష ప్రగతి సాధించింది. 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక వంటి అగ్ర జట్లపై చారిత్రాత్మక విజయాలు నమోదు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. 

అనంతరం 2025 ఛాంపియన్స్ ట్రోఫీలోనూ విశేషంగా రాణించింది. షాహిదీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని, అతడు ఆటగాడిగా జట్టుకు సేవలు కొనసాగిస్తాడని ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెట్ బోర్డు వెల్లడించింది. కొత్త వన్డే కెప్టెన్‌ను త్వరలోనే ప్రకటిస్తామని కూడా స్పష్టం చేసింది.

ఇటీవల టెస్టు జట్టుకు రషీద్ ఖాన్‌ను కెప్టెన్‌గా నియమించిన ఆఫ్ఘనిస్తాన్‌​ బోర్డు, ఇప్పుడు వన్డే జట్టుకు కూడా కొత్త నాయకుడిని ఎంపిక చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)