Breaking News

రికార్డు డబుల్‌ సెంచరీతో చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్‌ కెప్టెన్‌

Published on Mon, 12/30/2024 - 17:30

ఆఫ్ఘనిస్తాన్‌ కెప్టెన్‌ హష్మతుల్లా షాహిది సరికొత్త చరిత్ర సృష్టించాడు. జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో డబుల్‌ సెంచరీ (246) చేసిన షాహిది.. ఆఫ్ఘనిస్తాన్‌ తరఫున టెస్ట్‌ల్లో రెండు డబుల్‌ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. షాహిది 2021లో జింబాబ్వేపై తొలి డబుల్‌ సెంచరీ (200) చేశాడు.

తాజాగా డబుల్‌తో షాహిది మరో రికార్డు కూడా సాధించాడు. ఆఫ్ఘనిస్తాన్‌ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ (246) సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఇదే మ్యాచ్‌లో మరో ఆఫ్ఘనిస్తాన్‌ ప్లేయర్‌ రహ్మత్‌ షా (234) కూడా డబుల్‌ సెంచరీ చేశాడు. షాహిది​కి ముందు రహ్మత్‌ షాదే ఆఫ్ఘనిస్తాన్‌ తరఫున అత్యధిక స్కోర్‌గా ఉండేది.

మొత్తంగా ఆఫ్ఘనిస్తాన్‌ తరఫున టెస్ట్‌ల్లో మూడు డబుల్‌ సెంచరీలు మాత్రమే నమోదయ్యాయి. ఈ మూడింటిలో రెండు ఇదే మ్యాచ్‌లో నమోదు కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో మరో ఆఫ్ఘనిస్తాన్‌ ఆటగాడు (అఫ్సన్‌ జజాయ్‌) సెంచరీ (113) చేశాడు.

రహ్మత్‌, షాహిది డబుల్‌.. జజాయ్‌ సెంచరీ సాధించడంతో ఆఫ్ఘనిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ (699) చేసింది. టెస్ట్‌ల్లో ఆఫ్ఘనిస్తాన్‌కు ఇదే అత్యధిక స్కోర్‌. ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు ఆఫ్ఘన్‌ ఆటగాళ్లు మూడంకెల స్కోర్లు సాధించడం కూడా ఇదే మొదటిసారి. 

639 పరుగుల వరకు 3 వికెట్లు మాత్రమే కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్‌.. ఆతర్వాత 60 పరుగుల వ్యవధిలో మిగిలిన ఏడు వికెట్లు కోల్పోయింది. జింబాబ్వే బౌలర్లలో బ్రియాన్‌ బెన్నెట్‌ ఐదు వికెట్లు పడగొట్టగా.. సీన్‌ విలియమ్స్‌ 2, ముజరబానీ, గ్వాండు, న్యామ్హురి తలో వికెట్‌ దక్కించుకున్నారు.

అంతకుముందు జింబాబ్వే సైతం తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ (586) చేసింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో సైతం ముగ్గురు మూడంకెల స్కోర్లు సాధించారు. సీన్‌ విలియమ్స్‌ (154), కెప్టెన్‌ క్రెయిగ్‌ ఎర్విన్‌ (104), బ్రియాన్‌ బెన్నెట్‌ (110 నాటౌట్‌) సెంచరీలు చేశారు. కెరీర్‌లో తొలి టెస్ట్‌ ఆడుతున్న బెన్‌ కర్రన్‌ (ఇంగ్లండ్‌ ఆటగాడు సామ్‌ కర్రన్‌ అన్న) అర్ద సెంచరీతో (68) రాణించాడు. 

జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌తో పోలిస్తే ఆఫ్ఘనిస్తాన్‌ 113 పరుగులు ఎక్కువగా సాధించింది. జింబాబ్వే ఆటగాడు బ్రియాన్‌ బెన్నెట్‌ సెంచరీ సహా ఐదు వికెట్లు ప్రదర్శన నమోదు చేయడం మరో విశేషం.

113 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన జింబాబ్వే 5 ఓవర్ల అనంతరం వికెట్‌ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. బెన్‌ కర్రన్‌ (23), జాయ్‌లార్డ్‌ గుంబీ (4) క్రీజ్‌లో ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు జింబాబ్వే ఇంకా 81 పరుగులు వెనుకపడి ఉంది. మ్యాచ్‌ చివరి రోజు రెండో సెషన్‌ ఆట కొనసాగుతుంది. 

కాగా, మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ల కోసం ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో టీ20, వన్డే సిరీస్‌లను ఆఫ్ఘనిస్తాన్‌ కైవసం చేసుకుంది. టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో నెగ్గిన ఆఫ్ఘన్లు.. వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకున్నారు. ప్రస్తుతం తొలి టెస్ట్‌ జరుగుతుండగా.. రెండో టెస్ట్‌ జనవరి 2న ప్రారంభంకానుంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)