Breaking News

భరత్‌ ఒంటరి పోరాటం.. హర్యానా చేతిలో తెలుగు టైటాన్స్ చిత్తు

Published on Thu, 10/23/2025 - 07:42

ప్రోక‌బ‌డ్డీ లీగ్‌-2025 సీజ‌న్‌లో వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న తెలుగు టైటాన్స్‌కు హరియాణా స్టీలర్స్ ఊహించ‌ని షాకిచ్చింది. బుధ‌వారం రాత్రి ఢిల్లీ వేదిక‌గా హరియాణా స్టీలర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 34–45తో తెలుగు టైటాన్స్  పరాజయం పాలైంది.

టైటాన్స్‌ జట్టులో ఆల్‌రౌండర్‌ భరత్‌ (16) ఒక్కడే పోరాడాడు. 17 సార్లు కూతకెళ్లిన అతను 15 పాయింట్లు తెచ్చాడు. ప్రత్యర్థి రెయిడర్‌ను టాకిల్‌ చేసి మరో పాయింట్‌ అందించాడు. సహచరుల్లో డిఫెండర్‌ అంకిత్‌ (5) మెరుగ్గా ఆడారు. వీరిద్ద‌రూ మిన‌హా మిగితా అంద‌రూ దారుణంగా విఫ‌ల‌మయ్యారు.

స్టీలర్స్‌ విజయంలో రెయిడర్లు వినయ్‌ (11), శివమ్‌ పతారే (8) కీలకపాత్ర పోషించారు. రెయిడింగ్‌లో చురుగ్గా వ్యవహరించిన ఇద్దరు అదేపనిగా పాయింట్లు తెచ్చిపెట్టారు. డిఫెండర్లలో రాహుల్‌ 4, నీరజ్, హర్దీప్, కెప్టెన్‌ జైదీప్‌ తలా 3 పాయింట్లు సాధించారు.

కాగా తెలుగు టైటాన్స్ ఇప్ప‌టికే ప్లే ఆఫ్స్‌కు అర్హ‌త సాధించింది. ఇక‌ గురువారం జరిగే పోటీల్లో బెంగళూరు బుల్స్‌తో గుజరాత్‌ జెయింట్స్‌; యూపీ యోధాస్‌తో యు  ముంబా; పట్నా పైరేట్స్‌తో జైపూర్‌ పింక్‌పాంథర్స్‌ తలపడతాయి.
చదవండి: సెమీఫైనల్లో స్థానం కోసం... 
 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)