Breaking News

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌.. భారత జట్టులోకి మరో ఆటగాడు?

Published on Tue, 06/17/2025 - 21:16

ఇంగ్లండ్-భార‌త్ మ‌ధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మ‌రో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం రెండు వారాల ముందే ఇంగ్లండ్ గ‌డ్డ‌పై అడ‌గుపెట్టిన భార‌త జ‌ట్టు తీవ్రంగా శ్ర‌మించింది. విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ వంటి స్టార్ ప్లేయ‌ర్లు రిటైర్మెంట్ ప్ర‌క‌టించడంతో శుబ్‌మ‌న్ గిల్ సార‌థ్యంలోని యంగ్ టీమిండియా ఎలా రాణిస్తుంద‌న్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు లీడ్స్ వేదిక‌గా జూన్ 20 నుంచి 24 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌కు ముందు బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. యువ ఫాస్ట్ బౌల‌ర్ హ‌ర్షిత్ రాణాను బ్యాకప్ ఆప్ష‌న్‌గా భారత టెస్ట్ జట్టులో చేర్చినట్లు స‌మాచారం. కాగా ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌కు ఎంపిక చేసిన 18 మంది స‌భ్యుల‌ భార‌త జ‌ట్టులో రాణాకు చోటు ద‌క్క‌లేదు.

కానీ ఇంగ్లండ్ ల‌య‌న్స్‌తో అన‌ధికారిక టెస్టులు ఆడేందుకు ఇండియా-ఎ జ‌ట్టుకు రాణాను సెల‌క్ట‌ర్లు ఎంపిక చేశారు. ఈ క్ర‌మంలో ఇంగ్లండ్‌లో ఉన్న రాణాను జ‌ట్టుతో పాటు ఉండ‌మ‌ని సెల‌క్ట‌ర్లు సూచించిన‌ట్లు క్రిక్‌బ‌జ్ త‌మ రిపోర్ట్‌లో పేర్కొంది.  అయితే అత‌డిని ఇంకా జ‌ట్టులో అధికారిక స‌భ్యుడిగా లెక్కించ‌లేద‌ని బీసీసీఐ అధికారి ఒక‌రు పేర్కొన్న‌ట్లు క్రిక్‌బ‌జ్ తెలిపింది. 

కాగా గ‌తేడాది ఆస్ట్రేలియాతో జ‌రిగిన బోర్డర్ గవాస్కర్‌లో రాణా త‌న టెస్టు అరంగేట్రం చేశాడు.  2 మ్యాచ్‌ల్లో కేవ‌లం 4 వికెట్లు మాత్ర‌మే ప‌డ‌గొట్టాడు. దీంతో సెల‌క్ట‌ర్లు అత‌డిని ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌కు ఎంపిక చేయ‌లేదు. కానీ ఇప్పుడు ఆట‌గాళ్ల గాయాల బెడ‌ద దృష్ట్యా అతడికి మరోసారి అవకాశం లభించింది.

ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు భారత తుది జట్టు(అంచనా)
శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, శార్థూల్ ఠాకూర్, ప్రసిద్ కృష్ణ, జస్ప్రిత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.
చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌.. టీమిండియా కెప్టెన్‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్‌?

 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)