Breaking News

ఇంగ్లండ్‌ కెప్టెన్‌ విధ్వంసకర సెంచరీ.. 9 ఫోర్లు, 11 సిక్స్‌లతో! వీడియో

Published on Sun, 10/26/2025 - 10:56

మౌంట్ మౌంగనుయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఇం‍గ్లండ్‌ కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌( Harry Brook) విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు కివీస్‌ బౌలర్లు భారీ షాకిచ్చారు.

బ్లాక్‌ క్యాప్స్‌ బౌలర్ల ధాటికి ఇంగ్లండ్‌ కేవలం 34 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో హ్యారీ బ్రూక్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ జేమి ఓవర్టన్‌తో కలిసి కివీస్‌ బౌలర్లను ఎటాక్‌ చేశాడు. ఓవర్టన్‌తో కలిసి ఆరో వికెట్‌కు బ్రూక్‌ 87 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 

ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు పడతున్నప్పటికి ఇంగ్లీష్‌ జట్టు కెప్టెన్‌ మాత్రం తన విధ్వంసాన్ని మాత్రం ఆపలేదు. మౌంట్‌ మౌంగనుయ్‌లో బౌండరీల వర్షం​ కురిపించాడు. అతడు మెరుపు బ్యాటింగ్‌ ఫలితంగా ఇంగ్లండ్‌ 35.2 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది.

ఓవరాల్‌గా 135 బంతులు ఎదుర్కొన్న బ్రూక్‌..9 ఫోర్లు, 11 సిక్స్‌లతో 135 పరుగులు చేశాడు. ఆఖరి వికెట్‌గా బ్రూక్‌నే వెనుదిరిగాడు. కివీస్‌ బౌలర్లలో జకారీ ఫౌల్క్స్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. డఫీ మూడు, హెన్రీ రెండు వికెట్లు పడగొట్టారు. స్వల్ప లక్ష్య చేధనలో కివీస్‌ సైతం తడబడుతోంది. 66 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
చదవండి: రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ అప్పుడే.. కన్ఫర్మ్ చేసిన కోచ్‌



 

 

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)